లాక్ డౌన్ వేళ విశాఖలో ఓ జంట పిచ్చిపని…బొమ్మతో బురిడీ..చివరికి పోలీసుల ట్విస్ట్?

లాక్ డౌన్ వేళ విశాఖలో ఓ జంట పిచ్చిపని…బొమ్మతో బురిడీ..చివరికి పోలీసుల ట్విస్ట్?

by Anudeep

తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవు అని ఒక సామెత.. లాక్ డౌన్ తో ఒక్కసారిగా కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోపెట్టినట్టుగా ఉంది కొందరికి..దాంతో రకరకాల సాకులతో ఇంటి నుండి బయటకి వస్తున్నారు. బయట పోలీసులు ఊరుకుంటారా? లాఠీలకు బుద్ది చెప్తున్నారు. ఇలా అయితే కాదని ఒక పక్కా ప్లాన్ తో ఇంటి నుండి బయటకి వచ్చారు. వైజాగ్ లో ఒక జంట.. ఇంతకీ వీళ్లు వేసిన ప్లాన్ కి మనకి కూడా బుర్ర తిరిగిపోతుంది.

Video Advertisement

విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన దంపతులు బైక్‌పై బయటకు వచ్చారు .  పోలీసులు ఆపడంతో తమ బిడ్డకు సీరియస్‌గా ఉందని చెప్పారు. పోలీసులు కూడా నిజమే అనుకుని వదిలేశారు. అక్కడి నుంచి బయల్దేరి NAD జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడా పోలీసులు బైక్‌ను ఆపడంతో వారికి కూడా మళ్లీ అదే కారణం చెప్పారు. కానీ భార్యాభర్తల తీరుపై ఒక కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది.

ఒకసారి  పాప‌ను చూపించండి అంటూ మహిళ దగ్గరకు వెళ్లాడు. ముందు బిడ్డను చూపించడానికి నిరాకరించిన మహిళ, తర్వాత చూపించడంతో పోలీసులు అవాక్కయ్యారు.. అక్కడ ఉన్నది పాప కాదు బొమ్మ, పోలీసులకు మస్కా కొట్టడానికి వారు  వేసిన ప్లాన్ కి ఖంగుతిన్నారు.వెంటనే తేరుకుని సీరియస్ అయ్యేసరికి  వెంటనే మహిళ మాట మార్చేసింది. త‌మ బంధువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చూడడానికి వెళ్తున్నామని ,ఒక్కసారికి అనుమతించమని కోరింది.

representative image

అడిగింది మహిళ కదా పోలీసులు ఏమీ అనలేక, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించి పంపేశారు .  బంధువుకి అనారోగ్యం అనేది నిజమే అయితే, అత్యవసరం అయితే ప్రభుత్వాలే అనుమతిస్తున్నాయి..ఇంత ప్లాన్ వేయాల్సిన అవసరం ఏముంది..అయినా పోలీసులు ఊరుకున్నారు కాని..కరోనా ఊరుకోదు తల్లి.. మీరు పోలీసులతో ఆటలాడితే, కరోనా మీతో గేమ్స్ ఆడుతుంది..జాగ్రత్తా..


You may also like