ఉద్యోగంలో నుండి తీసేసారు అని…ఆ ఉద్యోగి బాస్ పై కోపంతో ఏం చేసాడో తెలుసా?

ఉద్యోగంలో నుండి తీసేసారు అని…ఆ ఉద్యోగి బాస్ పై కోపంతో ఏం చేసాడో తెలుసా?

by Anudeep

Ads

బాస్ – ఎంప్లాయ్ మధ్య ఇష్యూస్ అనేవి ఉద్యోగం అనేది పుట్టినప్పటి నుండి ఉన్నాయనకుంటా..ఎంప్లాయిస్ సరిగా పనిచేయట్లేదని బాస్ హూంకరింపులు.. ఏం బాస్ రా పని పని అని సతాయిస్తుంటాడనో, జీతం పెంచడనో మరే ఇతర కారణాలతోనే బాస్ ని తిట్టుకునే ఉద్యోగులు..చాలామంది బాస్ ని తిట్టుకుని వదిలేస్తారు..అది కూడా అతడికి తెలియకుండా..కానీ ఒక ఎంప్లాయ్ మాత్రం తనని ఉద్యోగంలో నుండి తీసేసాడనే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక  ఏం చేశాడో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

Video Advertisement

బాస్ తన మాట వినలేదని ఏకంగా బాస్ కి చెందిన ఫెరారి కార్ పైకి ట్రక్  ఎక్కించేసాడు ఒక ఉద్యోగి..చికాగోలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో  కారు ఫ్రంట్ పార్ట్ నుజ్జునుజ్జయి..పెరారి కార్ కి ఉన్న క్రేజ్ మాములుది కాదు..చాలామంది అయ్యో పెరారి అని నోరు తెరుస్తుంటే..మరికొందరు మరీ అంతగా కోపం వచ్చేలా ఏం చేశాడో అని డౌట్స్ వెలిబుచ్చుతున్నారు…

అసలింతకీ వారికి గొడవెక్కడొచ్చిందనే విషయం ఎవరికి అర్దం కావట్లేదు..కొందరేమో ఆ ఎంప్లాయ్ ని ఉద్యోగంలో నుండి తీసేసాడనే కోపంలో ఉండి, ఆవేశంతో ఈ పని చేశాడని అంటుంటే, మరికొందరు టార్గెట్ పూర్తి చేస్తే ఈ సారి కొత్త ట్రక్ ఇస్తానని చెప్ప బాస్ మాట తప్పాడని, అందుకే ఆ ఎంప్లాయ్ అలా చేశాడని అంటున్నారు.

సోషల్ మీడియాలో వైరలైన ఈ న్యూస్ పై కొందరు నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్ చేస్తున్నారు.. బాస్ , ఆ ఎంప్లాయ్ పై కంప్లైంట్ ఇవ్వొచ్చు అని కొందరు కామెంట్ చేస్తే, ఆ పెరారి కార్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది.. సో డోంట్ వర్రీ బ్రదర్ , ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్కోండి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like