ఇంటర్ ఫలితాల గురించి ఈ పిల్లవాడు చెప్పిన వీడియో చూశారా..? ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు వచ్చాయా..?

ఇంటర్ ఫలితాల గురించి ఈ పిల్లవాడు చెప్పిన వీడియో చూశారా..? ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు వచ్చాయా..?

by Harika

Ads

సాధారణంగా ఒక వయసులో పరీక్షల్లో వచ్చే రిజల్ట్స్ వల్ల ఒక మనిషికి మానసికంగా చాలా బాధ ఎదురవుతుంది. రిజల్ట్స్ మాత్రమే చాలా ముఖ్యం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. టెన్త్ సమయంలో ఆ రిజల్ట్స్ వల్ల భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది అని అవి చాలా సీరియస్ గా తీసుకుంటారు. తక్కువ వస్తే తమని తాము ఏదైనా చేసుకునే అంత బాధపడతారు. ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇలాగే చేస్తారు. ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇవే జీవితం కాదు. ఇవన్నీ చాలా మంది చాలా సార్లు చెప్పే విషయాలు. ఒక అబ్బాయి మాత్రం చాలా డిఫరెంట్ గా ఇంటర్ రిజల్ట్స్ గురించి చెప్పాడు.

Video Advertisement

boy about inter results

అబ్బాయి చాలా చిన్న పిల్లవాడు. అయినా కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పాడు. సాధారణంగా సోషల్ మీడియాలో చిన్న పిల్లలు కూడా తమ వయసుకి మించి మాటలు మాట్లాడుతుంటారు. కొంత మంది రీల్స్ కూడా చేస్తూ ఉంటారు. అవి కూడా సినిమా డైలాగ్స్ మీద చేస్తూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం జీవితానికి సంబంధించిన విషయాన్ని చాలా బాగా అర్థమయ్యేలాగా మాట్లాడాడు. ముందు ఈ అబ్బాయి మాట్లాడిన దానికి వయసుకు మించి మాట్లాడాడు అని చాలా మంది అనుకున్నా కూడా, ఒకసారి ఆలోచిస్తే అబ్బాయి చెప్పిన విషయాలు కూడా కరెక్ట్ కదా అంటూ మద్దతు ఇస్తున్నారు.

నిజంగా అబ్బాయి చెప్పిన మాటల్లో విషయం ఉంది. ఇంటర్ రిజల్ట్స్ మాత్రమే ఇప్పుడు పెద్ద సమస్య లాగా అనిపిస్తాయి. అందుకు కారణం వయసు. కానీ అది దాటి వెళ్తే దానికంటే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. చదువులో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగం దొరికాక పనిచేస్తున్న వాతావరణంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అవన్నీ ఉన్నాయి అని వదిలేసి వెనక్కి పారిపోలేం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. అదేంటో కనుక్కోవాలి. అంతే కానీ సమస్యలు ఉన్నాయి అని బాధపడకూడదు. అదే విషయాన్ని ఈ అబ్బాయి కూడా చెప్పాడు. అందుకే ఈ అబ్బాయి మాటలని చాలా బాగా చెప్పాడు అంటూ అందరూ అభినందిస్తున్నారు.

ALSO READ : ప్రేమలు సినిమాలో హీరో పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?


End of Article

You may also like