Ads
ప్రేమ విషయం అనేది కొంత మందికి మామూలుగానే ఉంటే, కొంత మందికి మాత్రం సమస్యలతో కూడుకుని ఉంటుంది. ఆ సమస్యలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్నిటికి వారికి వారు పరిష్కారం వెతుక్కోగలుగుతారు. కానీ కొన్నిటికి మాత్రం వేరే వాళ్ళని పరిష్కారం కోసం ఆశ్రయిస్తారు. అలా ఒక వ్యక్తి తాను తన ప్రేమలో ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం తెలపమని ఈ విధంగా మెసేజ్ చేశారు.
Video Advertisement
ఆ వ్యక్తి మాట్లాడుతూ, “నేను హైదరాబాద్ లో ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా పండగలు వస్తే ఊరికి వెళ్లేవాడిని. అలా ఒక సారి వెళ్ళినప్పుడు మా పక్కింట్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టు గమనించాను. వారికి ఒక అమ్మాయి కూడా ఉంది. పక్కనే ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం. నేను ఉన్న వారం రోజుల్లో తనతో చాలా మంచి స్నేహం ఏర్పడింది. తను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతోంది.
వారం రోజుల తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసాను. తన ఫోన్ నెంబర్ తీసుకోవడంతో అప్పుడప్పుడు మెసేజ్ చేసే వాడిని. మెల్లగా తనకి కూడా నేనంటే ఇష్టం అనే విషయం నాకు అర్థం అయింది. నేను డైరెక్ట్ గా అదే విషయం తనతో చెప్పేస్తే, తను కూడా తనకి నేనంటే ఇష్టం అని చెప్పింది. కానీ అంతకంటే ముందు తను బాగా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని మంచి పొజిషన్ కి వెళ్ళిన తర్వాత ,అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నాకు కూడా అదే నచ్చింది.
తర్వాత తను కష్టపడి క్యాంపస్ లోనే ఉద్యోగం సంపాదించింది. పోస్టింగ్ ముంబై లో వేశారు. నేను కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్ళి తనని కలిసి వస్తూ ఉండే వాడిని. అలా మా ప్రేమ మొదలయ్యి ఆరు సంవత్సరాలు అయిపోయింది. ఇంక పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళతో చెప్తే, ఇద్దరు ఇళ్లల్లో వాళ్ళు సరే అన్నారు. దాంతో మాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఇదంతా జరిగిన ఒక రెండు నెలల తర్వాత తన ప్రవర్తనలో మార్పు గమనించాను. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఏ విషయం చెప్పట్లేదు. దాంతో “విషయం ఏంటి?” అని చెప్పి గట్టిగా అడిగాను. అప్పుడు తను “నేను నీకు కరెక్ట్ కాదు. ఇద్దరికి సెట్ అవ్వదు” అని చెప్పింది. ఆ మాట వినగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. “ఏంటి సడన్ గా ఇలా అంటున్నావు?” అని అడిగాను. “చెప్తున్నా కదా! నాకు కూడా ఇప్పుడే అర్థం అయ్యింది. మనిద్దరికీ సెట్ అవ్వదు” అని చెప్పింది.
కానీ నాకు ఎక్కడో ఇదంతా తను మనస్పూర్తిగా మాట్లాడట్లేదు అని అర్థం అయ్యింది. విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాను. ముంబైలో తనతోపాటే ఉద్యోగం చేసే ఒక ఫ్రెండ్ నాకు కొంచెం తెలుసు. సోషల్ మీడియా ద్వారా తనకి మెసేజ్ చేసి ఏమైంది అని అడిగాను. ముందు తను రిప్లై ఇవ్వలేదు. తర్వాత పదే పదే అడిగేటప్పటికి అసలు విషయం చెప్పింది. ఒకరోజు వీకెండ్ కావడంతో తన ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి పబ్ కి వెళ్లారు.
అక్కడ ఆలస్యం అయ్యింది. నా గర్ల్ ఫ్రెండ్ స్నేహితురాలు ఇల్లు అక్కడే అవ్వడంతో తను వెళ్లిపోయిందట. నా గర్ల్ ఫ్రెండ్ ని కూడా తనతో పాటు రమ్మని అడిగితే లేదు హాస్టల్లో అన్ని వస్తువులు అలాగే పడేసి వచ్చాను నేను వెళ్ళిపోతాను అని చెప్పిందట. అదే కంపెనీలో పనిచేసే కొంత మంది మేల్ కొలీగ్స్ కార్లో వెళ్తూ నా గర్ల్ ఫ్రెండ్ ని దింపుతామని, వారు కూడా అదే దారిలో వెళ్తున్నారు అని చెప్పారు. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియక నా గర్ల్ ఫ్రెండ్ వారితోనే కార్లో ఎక్కిందట.
అలా కారులో ఎక్కిన నా గర్ల్ ఫ్రెండ్ ని బలవంతం చేశారు. గట్టిగా అరవబోతే బలంగా తలని కార్ సీట్ కి వేసి గుద్దారట. తను స్పృహ లేకుండా పడి ఉన్న స్థితిలో వారు తనపై బలవంతం చేశారు.ఈ విషయం నా గర్ల్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ కి చెప్పి నాతో చెప్పొద్దు అని చెప్పిందట. కానీ నేను పదే పదే అడిగే సరికి తన ఫ్రెండ్ ఈ విషయం చెప్పేసింది. నేను ఇంకా బాధ తట్టుకోలేక నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను.
జరిగిన సంఘటన ద్వారా తనపై నాకు ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. అదే విషయం తనతో చెప్పాను. కానీ తను మాత్రం ఇందుకు అస్సలు అంగీకరించడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే, నేను ఒకవేళ తనని పెళ్లి చేసుకుంటాను అని అడిగితే, తను చచ్చిపోతాను అని అంటోంది. ఇంత జరుగుతున్నా కూడా తనకి నేను అంటే చాలా ఇష్టమని నాకు అర్థం అవుతోంది.
నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు తనకి తోడుగా ఉండాలి అని ఉంది. తనని ఆ బాధ నుండి బయటకు తీసుకురావాలని ఉంది. తనతో జీవితాంతం కలిసి ఉండాలి అని ఉంది. కానీ తను మాత్రం అందుకు అంగీకరించడం లేదు. దీనికి పరిష్కారం చెప్పగలరా?” అని అడిగాడు. ఇందుకు మీరు ఏం పరిష్కారం చెప్తారు?
Note: all the images used in this article are just for representative purpose. But not the actual characters
End of Article