Ads
ప్రేమకు ఎల్లలు లేవు .. ప్రేమ గుడ్డిది.. ప్రేమకు ఏవి అడ్డురావు. ప్రేమకు ఏ అంతరాలు లేవు. ఇలా ప్రేమ గురించి ఎన్నో నిర్వచనాలు వింటూ ఉంటాం..అటువంటి వాటిని రుజువు చేస్తున్న సంఘటనలు ఎదురైతే ఆశ్చర్య పోతాం.. ఆ కోవకి చెందిందే ఈ ప్రేమకథ. ప్రేమకు కుల, మత, జాతి బేధాలు లేనట్టే వయసు బేధం కూడా లేదని నిరూపించారు పాకిస్థాన్ కి చెందిన ఈ జంట. ఓ యువకుడు తనకంటే వయసులో 12 ఏళ్ళు పెద్దదైన ఓ యువతిని ప్రేమించాడు. అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు..
Video Advertisement
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ కి చెందిన ఫాతిమా, ఆదిల్ ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఫాతిమా ఒకరోజు ఆదిల్ ని మార్కెట్ నుంచి కొన్ని సామాన్లు తెచ్చిపెట్టమని కోరిందట. ఆ క్రమం లో ఆమెతో ప్రేమలో పడినట్లు ఆదిల్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఆమె తన ప్రేమను తెలియజేస్తూ రోజుకొక గులాబీ పువ్వును వారింట్లోకి విసిరేవాడినని అతడు తెలిపాడు. ఒకరోజు ఆమెకు తన ప్రేమను తెలుపగా ఫాతిమా ఎంతో ఆశ్చర్యపోయింది ఆదిల్ వెల్లడించారు. అయితే ఆదిల్ తల్లితండ్రులను ఒప్పిస్తే ఈ వివాహానికి తాను ఒప్పుకుంటానని ఫాతిమా చెప్పిందట.
దీంతో ఆదిల్ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. ఆదిల్ చాలా మంచి వ్యక్తి అని, అతడి స్నేహితులు ఎంతగా హేళన చేసినా తన పై చూపించే ప్రేమలో మార్పు లేకపోవడం తో అతడిని పెళ్లి చేసుకున్నట్లు ఫాతిమా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. సమాజం గురించి తనకు పట్టింపు లేదని, తనంటే తనకు ఎంతో ఇష్టమని ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పాడు ఆ జూనియర్ ప్రేమికుడు. దీంతో వీరి ప్రేమ కహాని కాస్త వైరల్ గా మారింది.
ఇక ఫాతిమాకు ఏ పాటను అంకితం చేయాలనుకుంటున్నారని ఆదిల్‌ను అడిగినప్పుడు, అతను 2011 బాలీవుడ్ చిత్రం మర్డర్-2లోని ‘జిస్ రాహ్ పే హై ఘర్ తేరా’ పాటను పాడాడు. కాగా, ఫాతిమా మస్తీ సినిమాలోని ‘దిల్ దే దియా హై, జాన్ తుజే దేంగే’ పాటను హమ్ చేసింది. పెళ్లిళ్లు స్వర్గం లో నిర్ణయించబడతాయి అంటారు. అయితే కొన్ని జంటలను చూస్తే చాలా విడ్డురంగా ఉంటారు. ఇలాంటి జంటలను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు పాకిస్థాన్ కి చెందిన యూట్యూబర్ సయ్యద్ బాసిత్. అతడు తాజాగా ఈ జంట ను ఇంటర్వ్యూ చేయగా వీడియో వైరల్ గా మారింది.
End of Article