స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నా కూడా…బ్రహ్మాజీ సంచలన కామెంట్స్..!

స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నా కూడా…బ్రహ్మాజీ సంచలన కామెంట్స్..!

by Anudeep

Ads

తెలుగు సినిమా హీరోయిన్స్ గురించి నటుడు బ్రహ్మాజి సంచలన కామెంట్స్..ఏంట్రా మొన్నే కదా కాస్టింగ్ కౌచ్ , మీటూ గొడవలు కొంచెం సద్దుమణిగాయి. మళ్లీ ఇండస్ట్రీలో ఈ కొత్త కథ ఏంటి అనుకుంటున్నారా ?ఎవరి గురించి ఏమన్నాడో ?  నా ఫేవరెట్ హీరోయిన్ గురించి ఏమన్నా కామెంట్ చేశాడా? ఇలాంటి డౌట్లేం వద్దు.. ఫలానా హీరోయిన్ అని ఒకరిద్దరి పేర్లు పెట్టి కాదు ఏకంగా హీరోయిన్లందరి గురించి కామెంట్ చేశాడు. బ్రహ్మజి కామెంట్లో కూడా నిజం లేకపోలేదు…

Video Advertisement

అసలు విషయం ఏంటంటే ? కరోనా కలవరం గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. లాక్ డౌన్ నేపధ్యంలో అందరూ ముప్పతిప్పలు పడుతున్నారు. అందులో పేదవాళ్ల పరిస్థితి మరీ దారుణం. దీంతో ప్రభుత్వ సాయంతో పాటు , సినిమా తారలు, కొన్ని స్వచ్చంద సంస్థలు ముందకు వచ్చి పేదలకు సాయం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా కింది స్థాయి వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.దీంతో  వారికి నిత్యవసర సరుకుల పంపిణి,ఇతరత్రా సాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిందే కరోనా క్రైసిస్ చారిటి. ఇది చిరంజీవి ఆద్వర్యంలో నడుస్తోంది.

ఇప్పటివరకు ఇండస్ట్రీకి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా అన్నిరంగాల వాళ్లు ఈ చారిటికి ఎంతో కొంత ఆర్ధిక సాయం చేశారు. ఒక్క హీరోయిన్లు మినహా. వాళ్లల్లో కూడా లావణ్య త్రిపాఠి, ప్రణీత లాంటి ఒకరిద్దరు ముందుకొచ్చి తమ వంతు సాయం చేశారు కాని స్టార్ హీరోయిన్లుగా చలమాణి అవుతున్న ఏ ఒక్క హీరోయిన్ కూడా ఇప్పటివరకు ఉలుకుపలుకూ లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు నటుడు బ్రహ్మాజి.

 

ముంబైకి చెందిన ఎందరో హీరోయిన్స్ ఇక్కడ స్టార్ హీరోయిన్లు గా ఉన్నారు. కాని వాళ్లేవరు కార్మికులకు సాయం చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు. బ్రహ్మజీ చేసిన కామెంట్లో అర్దం లేకపోలేదని కొందరు నెటిజన్లు రెస్పాండ్అవతున్నారు. మరీ హీరోలంత సంపాదించకపోయినా హీరోయిన్ల స్థాయిలో వాళ్ల వాళ్ల రెమ్యునరేషన్స్ బాగానే ఉన్నాయి. కాని ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రం ఒకరిద్దరు తప్ప హీరోయిన్స్ ముందుకు వచ్చినట్టుగా ఎప్పుడూ కనపడలేదు..ఇప్పుడే కాదు.. ఆలోచించండి.


End of Article

You may also like