ఈ 10 బ్రహ్మానందం గారి పాత్రలు చూస్తే…మీమ్స్ కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది!

ఈ 10 బ్రహ్మానందం గారి పాత్రలు చూస్తే…మీమ్స్ కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది!

by Anudeep

Ads

సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఎన్నో మీమ్స్,ట్రోల్స్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంటాయ్.వాటిల్లో ఖచ్చితంగా బ్రహ్మానందం గారి ట్రోల్స్ ఉండి తీరాల్సిందే. బ్రహ్మనందం లేకుండా అటు ట్రోలర్స్ కి కాని,మీమ్ మేకర్స్ కి కాని ఇటు వాటిని చూసి ఎంజాయ్ చేసే వాళ్లకి కాని రోజుగడవదు.ఈ ట్రోల్స్ చాలా వాటిల్లో ఒక దశాబ్దంలో బ్రహ్మానందం నటించిన సినిమాల్లోవే.. ఆ పాత్రల్ని,పేర్లని,మేనరిజాల్ని క్రియేట్ చేసింది మరెవరో కాదు కోనవెంకట్. గోపి మోహన్,శ్రీధర్ పిపాస ,కోనవెంకట్ ముగ్గురూ కలిసి ఎన్నో కొత్త పాత్రలిని రూపొందించారు. వాటికి ప్రాణం పోసింది మాత్రం బ్రహ్మి గారే..కోన వెంకట్ ,బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన హిలేరియస్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుని నవ్వుకుందాం.

Video Advertisement

గజాలా ఫ్రం వెంకీ

గజాలా  ఇదేం పేరు ? వెంకీ సినిమా చూసినప్పుడు మనకి సేమ్ డౌట్ వచ్చింది కదా? అక్కడ స్టార్టయిందండీ ఈ ప్రయాణం.ఎన్నో పేర్లు ,ఎన్నో మేనరిజమ్స్ .వెంకీ సినిమాలో గజాలా పాత్రలో బ్రహ్మీ గారు అమాయకంగా,భయంభయంగా పాతపాటలొచ్చండీ అన్నా,కోపంగా వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ అని అన్నా చాలా నవ్వుకున్నాం.దశాబ్దం గడిచిపోయినా ఆ పాత్ర,ఆ డైలాగులు మనకి గుర్తుండి పోయాయి.

శ్రీరంగం శేషా చారి ఫ్రం ఢీ

మంచు విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.ఆ హిట్లో సింహభాగం రైటర్స్ కి చెందుతుంది,తర్వాత చారిగారి పాత్ర పోషించిన బ్రహ్మానందం గారికే..ఇప్పుడేం చేద్దాం చారిగారు అని విష్ణు అనగానే ,నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటూ బ్రహ్మానందం గారు పలికే డైలాగ్ ని మర్చిపోలేము,ఆ ఎక్స్ప్రెషన్నిఅస్సలు మర్చిపోలేం..

మెక్ డొనాల్డ్ మూర్తి ఫ్రం రెడీ

“నేను పైకి మాత్రమే యోగిని రా,లోపల భోగిని” ‘నాకు తెలియని ప్రపంచం ఏంట్రా బొంగులో ప్రపంచం” అంటూ రెడీ సినిమాలో రామ్ తో కలిసి నవ్వులు పూయించిన సీన్స్ ని,డైలాగ్స్ ని ఎలా మర్చిపోగలం.మరీ ముఖ్యంగా బ్రహ్మానందంగారు నడుచుకుంటూ వచ్చే వాకింగ్ స్టిల్ ని అయితే విచ్చలవిడిగా వాడేస్తున్నాం.

స్వరబ్రహ్మ జయసూర్య ఫ్రం కింగ్

శారదా అంటూ శంకరశాస్త్రిగారు సీరియస్ గా తిట్టిన శంకరాభరణం సినిమా డైలాగ్ ఎంత ఫేమస్సో,అంతకంటే డబుల్ ఫేమస్ కింగ్ సినిమాలో స్వరబ్రహ్మ జయసూర్య పాత్రలో బ్రహ్మీ గారి డైలాగ్స్.ఎప్పుడంటే అప్పుడు మీమ్స్ కి అందుబాటులో ఉండే మోస్ట్ ఫేమస్ ఎక్స్ప్రెషన్ ఈ సినిమాలో బ్రహ్మీ గారిది..కాదంటారా??

భట్టాచార్య ఫ్రం అదుర్స్

ఎన్నిసార్లు చూసినా బొర్ కొట్టని సినిమా అదుర్స్.అందులో భట్టాచార్య అదేనండి మన బట్టూ..అమరప్రేమికుడు బట్టూగా బ్రహ్మీ గారి క్యారెక్టర్,ఎక్స్పెషన్స్ సూపర్..బట్టూ బట్టూ అంటూ తల్లీకూతుళ్లిద్దరూ సాంతం నాకేసినా ప్రేమ ప్రేమా అంటూ పాకులాడిన ఆ పాత్రని మర్చిపోగలమా..

పద్మ శ్రీ ఫ్రం దూకుడు

“నాగార్జున గారూ ఎలిమినేట్ హిమ్ అండీ,ఎలిమినేట్ హిం..” “వాడుకోండయ్యా వాడుకున్నోళ్లకి వాడుకున్నంత” అనే రెండు డైలాగులు దూకుడు సినిమాలోనివి.ఈ సినిమాలో పద్మ శ్రీ పాత్రలో బ్రహ్మీ గారు ఈ డైలాగ్స్ చెప్తుంటే పొట్టచెక్కలవుద్దంటే నమ్మండి..వాడుకోమన్నరాని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాం మన తప్పేమన్నా ఉందా మీరే చెప్పండి నాగార్జున గారూ..

పద్మనాభసింహా ఫ్రం బాద్షా

శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన మరో హిలేరియస్ మూవీ బాద్ షా.సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.అందులో పద్మనాభసింహగా బ్రహ్మీ గారు సూపర్..ఒరేయ్ తుప్పాస్ వెధవా..అనే డైలాగ్ ఎంతో ఫేమస్..

డింపుల్ ఫ్రం అల్లుడు శీను

“డింపుల్” అనే పాత్ర,ఆ పాత్రలో బ్రహ్మానందం గారు.. ఆ నటన,ఆ కామెడీ లేకపోతే అసలు ఆ సినిమా చూడనే చూడరు ఎవరూ..కేవలం డింపుల్ కోసమే అదే నండి మన బ్రహ్మానందం గారి కామెడీ కోసమే అల్లుడి శీను సినిమా చూసిన సినీఅభిమానులెందరో.

సిప్పీ ఫ్రం లౌక్యం

“మనం మనం బరంపురం” మనం మామూలుగా వాడే డైలాగే కానీ..దానికి ఒక రేంజ్ ని తీసుకొచ్చింది మాత్రం బ్రహ్మిగారే..లౌక్యం సినిమాలో సిప్పీ పాత్రలో బ్రహ్మీగారి నటన మనం మనం బరంపురం అనే డైలాగ్ సూపర్ కామెడీ అసలు..కావలంటే మీరూ చూసి నవ్వుకోండి.

వీకెండ్ వెంకట్రావ్ ఫ్రం పండగ చేస్కో

రామ్ – బ్రహ్మానందంగారి కాంబోలో వచ్చిన మరో హిలేరియస్ ఎంటర్ట్నైన్మెంట్ పండగ చేస్కో.వీకెండ్ వెంకట్రావ్ గా బ్రహ్మీ గారి క్యారెక్టర్,అందులో కళ్లల్లో నుండి కామం కారిపోతుంది కంట్రోల్ చేస్కోండి సర్ అనే డైలాగ్ గుర్తుందా…ఎలా మర్చిపోతారు లెండి.

ఇవండీ కోన వెంకట్,బ్రహ్మీ గారి కాంభినేషన్లో వచ్చిన హిలేరియస్ క్యారెక్టర్స్,చూసి కడుపుబ్బా నవ్వుకోండి..మీకు తెలిసిన మరికొన్ని క్యారెక్టర్స్ ని కామెంట్ చేయండి.


End of Article

You may also like