Breaking News: ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి హఠాన్మరణం.. అసలేం జరిగిందంటే?

Breaking News: ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి హఠాన్మరణం.. అసలేం జరిగిందంటే?

by Anudeep

Ads

అలనాటి నటుడు నందమూరి తారకరామారావు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి హఠాన్మరణం పొందారు. కంఠమనేని ఉమా మహేశ్వరి ఎన్టీఆర్ కు స్వయానా నాలుగవ కుమార్తె. ఆమె మరణంతో ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఉమా మహేశ్వరి కన్నుమూశారు.

Video Advertisement

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి హఠాత్తుగా మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్నారు. మరికాసేపట్లో.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆమె ఇంటికి చేరుకోనున్నారు.

uma maheswari 1

ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరిని మొదట నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసారు. అయితే.. అతను అనేక ఇబ్బందులకు గురి చేస్తుండడంతో… అతని నుంచి ఉమా మహేశ్వరి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత పెద్దలు  ఆమెను కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసారు. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మొత్తం పదకొండు మంది సంతానం కాగా.. వారిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.. వారిలో ఉమా మహేశ్వరి నాలుగవ కుమార్తె.

uma maheswari

గత కొంతకాలంగా ఉమా మహేశ్వరి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, మానసిక సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె తన చిన్న కుమార్తెకు వివాహం జరిపించారు. పాతికేళ్లుగా దూరంగా ఉంటూ వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు, చంద్రబాబు నాయుడులు ఈ వేడుక తోనే కలుసుకున్న తెలిసిందే. హఠాత్తుగా ఉమా మహేశ్వరీ మరణించడంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు.


End of Article

You may also like