బ్రహ్మానందం గారి ఈ టాలెంట్ గురించి మీకు తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడ దాచారు సార్!

బ్రహ్మానందం గారి ఈ టాలెంట్ గురించి మీకు తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడ దాచారు సార్!

by Anudeep

Ads

లాక్ డౌన్ వేళ సినిమా వాళ్లు, ప్రముఖులు ఇళ్లల్లోనే ఉంటూ వారికి నచ్చిన పనులు వారు చేస్తూ ఉన్నారు. బి ద రియల్ మాన్ పేరిట స్టార్ హీరోలు, ప్రొడ్యుసర్లు ఇంటి పనులు చేస్తూ వీడియోలు పెడుతుంటే , బ్రహ్మానందం గారు మాత్రం తనకు నచ్చిన మట్టిబొమ్మలు చేసుకుంటూ, బొమ్మలు గీస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

Video Advertisement

వరుస సినిమాలు చేసి అనారోగ్యంతో కొంత బ్రేక్ తీసుకున్న బ్రహ్మానందంగారు, క్రిష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న రంగమార్తండలో నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఇంట్లోనే ఉంటున్న బ్రహ్మానందం తన కళను మళ్లీ ప్రారంభించారు.. బ్రహ్మానందం గారు మట్టిబొమ్మలు చేస్తూ, బొమ్మలు గీస్తున్నారు. అవికూడా ఆషామాషిగా కాదండీ, ప్రపంచస్థఆయి కళాకారుడు రేంజ్లో  మట్టిబొమ్మలకు ప్రాణం పోస్తుంటారు.

అంతేకాదు బ్రహ్మానందం గీసిన శ్రీశ్రీ  చిత్రాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్. అది సోషల్ మీడియాలో వైరలవడంతో బ్రహ్మానందంలో ఉన్న టాలెంట్ కి ఆయన అభిమానులే కాదు, నెటిజన్లంతా ఫిదా అవతున్నారు.కొన్న వేల సినిమాల్లో నటించి మనల్ని కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందంగారు అస్సలు సినిమాలు చూడరంటే నమ్ముతారా..తను నటించిన సినిమాలే కాదు, ఏ సినిమాలు కూడా చూడని బ్రహ్మానందం గారు లాక్ డౌన్ కాలం తనకేం కొత్తగా లేదని, తన రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉందని ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ లైవ్లో అన్నారు.


End of Article

You may also like