Ads
పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ పెళ్లి ఆపండి అని మాట సినిమా లో తప్ప బయట జరగదు అనుకుంటారు,కానీ తమిళనాడు నీల్‌గిరీస్‌లోని మట్టకండి లో ఈలాంటి ఘటన చోటుచేసుకుంది .. ఇక్కడ పెళ్లి ఆపండి అని చెప్పింది స్వయంగా పెళ్లి కూతురు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది .బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబసభ్యులు కరోనా నిబంధనలను పాటిస్తూ అక్టోబర్ 29న ముహూర్తం పెట్టుకున్నారు.వరుడు తాళికట్టే సమయంలో నాకు ఈ పెళ్లి వద్దు అంటూ పెళ్లికూతురు గోల చేసింది ..తన ప్రియుడు అరగంటలో వస్తాడని, అప్పటి వరకు పెళ్లి ఆపాలని పట్టుబట్టింది. దీంతో పెళ్లి కొడుకుతో పాటు పెళ్లికొచ్చినవారంతా షాకయ్యారు. ఈ పెళ్లి జరగదని నిర్ణయించుకున్న వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఎంత సేపు వేచి చూసినా.. వధువు చెప్పిన ప్రియుడు రానే లేదు. దీంతో పెళ్లికూతురుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు బంధువులు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Video Advertisement
End of Article