గంటలో పెళ్లి అనగా వ్యాక్సినేషన్ సెంటర్ కి వచ్చిన వధువు.. పట్టు వస్త్రాలతోనే ప్రత్యక్షం.. హైదరాబాద్ మెగా వాక్సిన్ డ్రైవ్.!

గంటలో పెళ్లి అనగా వ్యాక్సినేషన్ సెంటర్ కి వచ్చిన వధువు.. పట్టు వస్త్రాలతోనే ప్రత్యక్షం.. హైదరాబాద్ మెగా వాక్సిన్ డ్రైవ్.!

by Anudeep

Ads

ఇప్పుడిప్పుడే కరోనా రెండో వేవ్ కూడా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమం లో ఇటీవలే సైబరాబాద్ పోలీసులు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. గంటల వ్యవధిలోనే నలభైవేల మందికి పైగా వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. 18 సంవత్సరాల వయసు పైబడ్డవారందరికి వాక్సిన్ ను వేశారు.

Video Advertisement

bride at vaccination center

ఈ వాక్సిన్ డ్రైవ్ లో చాలా మంది ఎన్నారైలు, సెలెబ్రిటీలు కూడా పాల్గొనడం గమనార్హం. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఓ నూతన వధువు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మరో గంట లో ఆమె పెళ్లి చేసుకోనుండగా… వాక్సిన్ వేయించుకోవడం కోసం ఆమె ఈ వ్యాక్సినేషన్ సెంటర్ కు వచ్చింది. హైటెక్స్ గ్రౌండ్ లో జరిగిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. పట్టు వస్త్రాలలోనే ఆమె వాక్సిన్ వేయించుకున్నారు.

vaccine

మెడికోర్ నర్సులు ఆమెకు వాక్సిన్ వేసిన తరువాత ఆమెతో ఫోటోలు దిగారు. వాక్సిన్ వేయించుకున్న తరువాత పెద్ద గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కనిపించలేదని.. ఇలా వాక్సిన్ వేయించుకోవడం తనకు చాలా ఎగ్జయిటింగ్ గా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి సమయానికి ముందు వాక్సిన్ వేయించుకోవడానికి తన తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. వాక్సిన్ వేయించుకుంటుండగా ఆమె తీయించుకున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో మరింతమందిని వాక్సిన్ వేయించుకునే దిశగా మార్గనిర్దేశం చేస్తోంది.


End of Article

You may also like