పెళ్లిలో భోజనానికి వింత రూల్ విధించిన వధువు…దెబ్బకి అతిథులు షాక్.! అదేంటంటే.?

పెళ్లిలో భోజనానికి వింత రూల్ విధించిన వధువు…దెబ్బకి అతిథులు షాక్.! అదేంటంటే.?

by Anudeep

Ads

పెళ్లి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పంచభక్ష పరమాన్నాలతో వడ్డించే వివాహ భోజనం. పైగా ఈ మధ్య పెళ్లి భోజనం అంటే కనీసం ఓ 30 వెరైటీ తో విందు ఏర్పాటు చేయటం ఆనవాయితీ గా మారింది. పెళ్లి కి వచ్చే జనం కూడా పెళ్లి కూతురి నగలకంటే, పెళ్లి మండపం డెకరేషన్ కంటే విందు భోజనం రుచులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Video Advertisement

ఈ క్రమంలో వచ్చిన బంధు మిత్రులు లను సంతృప్తి పరచడానికి వధూవరుల తల్లి తండ్రులు భారీగానే ఖర్చు చేస్తున్నరు. అయితే తాజాగా జరిగిన ఒక పెళ్లిలో వధువు తన పెళ్లికి పెట్టిన విందు భోజనానికి ఆహ్వానితులు అందరూ బిల్లు చెల్లించాలని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోందని,ఇంత భారీ భోజనాల ఖర్చు తమ కుటుంబం భరించలేదని, అందుకే ఇక్కడకు విచ్చేసి భోజనం చేసిన అందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

సోషల్ మీడియాలో కనీవిని ఎరుగని తన ఈ ఐడియా ను ఆ వధువు షేర్ చేయడం తో అది చూసిన నెటిజనులు అందరూ అవాక్కవుతున్నారు. “మీలో ఎవరైనా మీ అతిధుల నుంచి భోజనానికి డబ్బులు అడిగారా? ప్రస్తుతం ప్రతిదీ కూడా బాగా ఖరీదైనవిగా మారిపోయాయి.అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలా వాయిదా వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా.లేదంటే బహుమతులకు బదులుగా అతిథుల నుంచి భోజనానికి డబ్బులు వసూలు చేయాలని యోచిస్తున్నా.ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించా.

భోజనాలకి బిల్లు వసూలు చేయడం ఎలా జరుగుతుందో ఏమో.నాకు చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది హెల్ప్ చేయండి” అని ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేసిన ఆ వధువు ధైర్యానికి మెచ్చుకుంటూ, ఇకనైనా పెళ్లి అనేది ఆడపిల్ల తల్లిదండ్రులకు గుడిబండ కాకూడదు అని సమాజం గుర్తించాలి అని కొందరు అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like