Ads
ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటిదాకా సంతోషం గా గడిపిన క్షణాలు ఒక్కసారిగా విషాదాంతం గా మారిపోవచ్చు. పెళ్లి బాజాల నడుమ సందడి నెలకొన్న వేళ నూతన వధువు మృతి చెందిన వైనం గురువారం ఒడిశా రాష్ట్రానికి చెందిన సోనేపూర్ జిల్లా లో చోటు చేసుకుంది. హఠాత్తుగా ఆమె ఎలా మృతి చెందిందో ఎవ్వరికి అర్ధం కాలేదు. ఇంతకీ ఏమి జరిగిందో తెలుసుకుందాం రండి.
Video Advertisement
గుప్తేశ్వరి సాహూ అనే అమ్మాయి మేనకా, మురళి సాహు దంపతుల సంతానం. వీరు సోనేపూర్ జిల్లా లో నివాసముంటున్నారు. మురళి సాహు దంపతులు తమ కుమార్తె కు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే వ్యక్తి తో వివాహం నిశ్చయించారు. ఈ వివాహం వేడుక సందర్భం గా అందరు ఉల్లాసం గా ఉన్నారు. ఈ వేడుక గురువారం రాత్రి జరిగింది. అయితే, మరుసటి రోజు అప్పగింతల సమయం వచ్చింది. అప్పటిదాకా వేడుక హుషారు లోనే ఉన్న పెళ్లి కూతురు అప్పగింతల సమయం లో కన్నీరు ఆపుకోలేకపోయింది.
తల్లి తండ్రులకు దూరం అవుతున్నానన్న బాధలో గుక్క పెట్టి ఏడ్చేసింది. కొంతసేపటికి ఆమె తూలిపడింది. మొదట అందరు ఆమె నీరసం వలన పడిపోయిందని అనుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె గుండెపోటు కారణం గా మృతి చెందిందని తెలిపారు. ఎక్కువ గా ఏడ్చి ఏడ్చి ఉండడం వలన, ఆమె గుండె పై భారం పెరిగి మరణించింది. పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధి లోనే ఇలా చోటు చేసుకోవడం తో పెళ్లి కి వచ్చిన బంధువులంతా విషాదం లో మునిగిపోయారు.
End of Article