Ads
అప్పటివరకు ఆ పెళ్ళిమంటపం సందడిగానే ఉంది. కాసేపట్లో పెళ్లి చేసుకోవడానికి వధూవరులు సిద్ధంగానే ఉన్నారు. దండలు కూడా మార్చుకున్నారు. తీరా తాళికట్టే సమయానికి వరుడు కనిపించలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. వరుడు వుద్దేశ్యపూర్వకం గానే మాయం అయ్యాడని తెలియడం తో.. వధువు తల్లి తండ్రులు ఆలోచనలో పడ్డారు.
Video Advertisement
పెళ్ళికి వచ్చిన అతిధుల్లో ఎవరైనా తమ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. ఓ యువకుడు ముందుకు రావడం తో.. వారి తల్లి తండ్రులతో మాట్లాడి.. అప్పటికప్పుడే పెళ్లి చేయించారు. ఒక్క వరుడు మారడం తప్ప మిగిలిన తతంగమంతా యధావిధి గా జరిగింది. పెళ్లి తంతు ముగిశాక.. వధువు తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో వరుడి కుటుంబం పై కేసు పెట్టారు.
End of Article