చిన్నప్పుడే విడిపోయారు.. 42 ఏళ్ల తరువాత కలుసుకున్న అక్కా తమ్ముళ్లు.. సినిమాను తలపించే రియల్ లైఫ్ స్టోరీ!

చిన్నప్పుడే విడిపోయారు.. 42 ఏళ్ల తరువాత కలుసుకున్న అక్కా తమ్ముళ్లు.. సినిమాను తలపించే రియల్ లైఫ్ స్టోరీ!

by Mohana Priya

Ads

చిన్నప్పుడే తల్లితండ్రులు ఈ అక్క తమ్ముళ్ళని ఓ చిన్నారుల సంరక్షణ కేంద్రంలో వదిలిపెట్టేసారు. వారిని వేర్వేరు దంపతులు దత్తత తీసుకుని పెంచుకున్నారు. వారి పేర్లు కూడా మారిపోయాయి. అలా ఈ అక్క తమ్ముళ్లు ఒకరి నుంచి మరొకరికి దూరం అయ్యారు. దాదాపు 42 సంవత్సరాల తరువాత వీరిద్దరూ కలుసుకున్నారు.

Video Advertisement

సినిమా స్టోరీని తలపించే వీరి రియల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. మేరీ క్యాథరీన్ అనే ఓ మహిళా 1970 లలో బ్లూ మౌంటైన్స్ అనే చిన్నారుల సంరక్షణ కేంద్రం నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడకు అయవు, సరస్వతి అనే భార్యాభర్తలు తమ పిల్లలను అప్పజెప్పి వెళ్లిపోయారు.

brother 1

వారి పేర్లే విజయ, రాజ్ కుమార్‌. అయితే.. రాజ్ కుమార్ ను 1979 లో డానిష్ దంపతులు దత్తతకు తీసుకున్నారు. ఆ తరువాత ఆ అబ్బాయికి క్యాస్పర్ ఆండర్సన్ అని పేరు కూడా మార్చేశారు. అలాగే అతని సోదరి విజయని కూడా అమెరికన్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెకు డైయేన్‌ అని పేరు మార్చారు. దత్తత తీసుకునే సమయానికి ఆండర్సన్ చాలా చిన్నవాడు. తనని దత్తత తీసుకున్న ఫ్యామిలీ చాలా బాగా చూసుకున్నారు. కానీ, తాను వారి సొంత కొడుకుని కాదని, తన శరీర రంగుని బట్టి తనకి భారత దేశంలో మూలాలు ఉండి ఉంటాయని బలంగా నమ్మేవాడు.

brother 2

అయితే.. తనకి ఓ సోదరి ఉందన్న విషయం మాత్రం ఆండర్సన్ కు తెలియదు. చాలా చిన్న వయసులోనే ఆండర్సన్ ను దత్తత తీసేసుకున్నారు. మరోవైపు, డైయేన్‌ కు మాత్రం తనకో సోదరుడు ఉన్నాడు అన్న సంగతి గుర్తుంది. చిన్న వయసులో తన సోదరునితో కలిసి ఫుడ్ ని పంచుకుని తినడం మాత్రం ఆమెకు గుర్తుండేది. ఆండర్సన్ తన ఫ్యామిలీ మూలలను తెలుసుకోవాలని ఓ సారి DNA టెస్ట్ సంస్థకు శాంపిల్ ఇస్తాడు. తన కుటుంబ సభ్యులను కలుసుకోగలుగుతాను అని అతను ముందు అనుకోలేదు. కానీ, ఆ తరువాత అతనికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తన డిఎన్ఏ టెస్ట్ ను 100 % ఓ వ్యక్తి తో మ్యాచ్ అయిందని చెప్పాడు.

brother 3

అలా మొదటిసారిగా 42 ఏళ్ల తరువాత 2019 లో ఆండర్సన్ తన సోదరి డైయేన్‌ తో మాట్లాడాడు. డైయేన్‌ కొడుకే ఆమె మూలాలు తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ కు ప్రయత్నిస్తాడు. అలా ఈ ఇద్దరు అక్క తమ్ముళ్లు కలుసుకున్నారు. ఆండర్సన్ తన సోదరిని కలిసాక చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమాల్లోనే ఇలా జరుగుతుంది అనుకున్నా… నా తల్లితండ్రులను కలుసుకోవాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్న నాకు ఇలా అక్కని కలుసుకుంటా అని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు.


End of Article

You may also like