ఇదేందయ్యా ఇది … “బాస్” మాస్ ఎంట్రీ BGM ని … ఇలా మెలోడీ సాంగ్ లో కాపీ కొట్టేశారు.?

ఇదేందయ్యా ఇది … “బాస్” మాస్ ఎంట్రీ BGM ని … ఇలా మెలోడీ సాంగ్ లో కాపీ కొట్టేశారు.?

by Mohana Priya

Ads

సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.

Video Advertisement

bruce lee megastar entry bgm used in another movie

ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే, అలా ఒక సినిమాలో ఒక పాటకి వాడిన ట్యూన్ ఇంకొక సినిమాలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్యూన్ కి దగ్గరగా ఉంది. వివరాల్లోకి వెళితే. బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ కి వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరూ మర్చిపోలేరు. అంత పవర్ ఫుల్ గా ఉంటుంది ఆ మ్యూజిక్.

అయితే అదే మ్యూజిక్ కొంచెం మార్పుతో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ సినిమా చక్రవ్యూహ లో ఒక పాటలో వినిపిస్తుంది. మొత్తం కాకపోయినా సడన్ గా మనకు వినంగానే బ్రూస్ లీ సినిమా మ్యూజిక్ గుర్తొస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

ఇంకొక విషయం ఏంటంటే చక్రవ్యూహ సినిమా 2016 లో వచ్చింది. బ్రూస్ లీ సినిమా 2015 లో వచ్చింది. కాబట్టి వాళ్ళ ట్యూన్స్ వాళ్లు వేరే సినిమాలకు ఉపయోగించుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఒక తమన్ మాత్రమే కాదు ఇలాగే ఎ.ఆర్.రెహమాన్, హ్యారిస్ జయరాజ్, దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఎంతో మంది సంగీత దర్శకులు తాము కంపోజ్ చేసిన ట్యూన్స్ వారి వేరొక సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాగానో, లేదా ఇంకొక పాట లాగానో ఉపయోగించారు.


End of Article

You may also like