Ads
అబ్బబ్బా, ఏం స్కూలో ఏంటో? ఉదయాన్నే లేవాలి , రెడీ అవ్వాలి , బ్యాగ్ నిండా పుస్తకాలు మోసుకుంటూ పోవాలి . అదే ఎంచక్కా కాలేజ్ అయితే ఇవేవి ఉండవు . ఇంజనీరింగ్ అయితే ఇక కాలేజ్ లైఫంతా జిల్ జిల్ జిగా అనుకుంటున్నారా? ఇకపైన ఈ పప్పులేవీ ఉడకవు . కాలేజ్ కూడా స్కూల్ లా స్ట్రిక్ట్ గా మారబోతుంది. డెయిలీ క్లాస్ కి టైంకి రావల్సిందే, బంక్ కొట్టడానికి అస్సలు వీల్లేదు . టీచర్స్ ని, క్లాస్ మానిటర్ ని మ్యానేజ్ చేయడానికి అస్సలు కుదరదు. ఎందుకో తెలుసా ?
Video Advertisement
కాలేజ్ బంక్ కొట్టేవారికి ఓ సరికొత్త విధానం ప్రవేశపెట్టింది హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ. విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) విద్యార్థుల హాజరు పెంచేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టింది. జేఎన్‌టీయూ హెచ్ పరిధి కిందకు వచ్చే దాదాపు 250 కాలేజీలు ఇకపై బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంను ప్రవేశపెట్టనున్నాయి. ఇది ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది.
మరో రెండు వారాల్లో అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థ రానుంది. ఇప్పటికే దీని ప్రక్రియ ప్రారంభమైందని జేఎన్‌టీయూ రెక్టార్ మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ చెప్పారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం టీచింగ్ స్టాఫ్‌కు పోస్టుగ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఉండేది. తాజాగా ఇంజినీరింగ్ విధ్యార్దులకు బయోమెట్రిక్ అటెండెన్స్ పద్దతి ప్రవేశపెట్టడంతో కాలెజ్ ఎగ్గొట్టే స్టూడెంట్ పర్సంటేజ్ తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాదు విద్యార్థులు క్రమశిక్షనతో ఉండడానికి, రెగ్యులర్ కాలేజ్ అటెండ్ అయి క్లాసులు శ్రద్దగా వినడానికి ఈ విధానం ఉపయోగపడుతుందనుకుంటుంది జెఎన్టియు స్టాఫ్.
జేఎన్‌టీయూలో జరిగిన హైలెవెల్ మీటింగ్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంకు మొత్తం 250 అనుబంధ కాలేజీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బయోమెట్రిక్ వ్యవస్థతో పాటు విద్యావ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫ్యాకల్టీ తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ మరియు అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్‌లాంటివి నేర్చుకోవాలని సూచించింది. అంతేకాదు విద్యార్థుల్లో ఎంట్రప్యూనర్షిప్ కల్చర్‌ను అలవర్చాలని సమావేశంలో నిర్ణయించారు.
చూద్దాం ఈ బయోమెట్రిక్ విధానం అటెండెన్స్ పర్సంటేజిని ఎంతవరకు పెంచుతుందో? స్టూడెంట్స్ ని కాలేజ్ పట్ల, క్లాసెస్ పట్ల ఎంతవరకు ఇంట్రస్ట్ కలిగిస్తుందో ?
End of Article