Ads
కమ్మాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్… ఆన్ ది వేలో పాడుకుందాం డ్యూయెట్టు… ఎక్కడ చూసినా ఇదే పాట. పాట పాడమన్నా, డాన్స్ చెయ్యమన్నా ముందు ఈ పాటే గుర్తొస్తుంది అందరికీ. దీనికి ముందు బుల్లెట్ పాటలు ఎన్నో వచ్చి, హిట్ అయ్యాయి. అయినప్పటికీ డీఎస్ పీ మ్యూజిక్ అందించిన ఈ పాట, దాని సొంత స్టైల్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. అందులోనూ రామ్ పోతినేని, కృతి శెట్టి డాన్స్ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు.
Video Advertisement
అంతా బాగానే ఉంది కానీ మరి ఈ పాట పాడిన ఫిమేల్ సింగర్ ఎవరో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్య పోతారు. అవునా!! అంటూ నోరు తెరుచుకుంటారు. అయితే ఈ పాట పాడిన ఫీమేల్ సింగర్ పేరు హరి ప్రియ. తన వయసు సుమారు 22 ఏళ్లు ఉంటుందట.
ఇంత చిన్న వయసులో, తన స్వరంతో, మంచి హిట్ సాంగ్ ఇచ్చిన హరి ప్రియ ఎవరో తెలిసాక నెటిజన్లు కామెంట్ల రూపంలో పొగడ్తలతో ముంచెత్తారు. కాగా ఈ విషయాన్ని తన వాయిస్ తో అందరి చెవులకి వినసొంపు కలిగించే ఫేమస్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి స్ట్రీపద ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది.కెవ్వు కేక వంటి అనేక హిట్ పాటలతో ప్రేక్షకులను అలరించిన, కృష్ణ మురళి కూతురే ఈ సింగర్ హరి ప్రియ.
అయితే ఇప్పుడు ఆయన బ్రతికి ఉండక పోయినా కళ, సంగీతం రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారని. ఆయన కూతురు చిన్న వయసులోనే, ఇలా ఏదగడం చూస్తే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారని, నెటిజన్లు అంటున్నారు. అంతక ముందు శివం మూవీలో అందమైన లోకం, రమా రావ్ ఆన్ డ్యూటీలో సొట్టాల్లో బుగ్గల్లో, వంటి అనేక పాటలను పాడింది సింగర్ హరి ప్రియ. ఇకముందు కూడా ఇలాంటి ఎన్నో పాటలతో ప్రేక్షకుల మనసులు దోచుకుని, మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటూ పలువురు సినీ పెద్దలు ఆశీర్వదిస్తున్నారు.
End of Article