బస్సులో పక్క సీట్లో ఉన్న ఆకతాయి వేధిస్తుంటే ఆ మహిళ తెలివిగా ఏం చేసారో తెలుసా?

బస్సులో పక్క సీట్లో ఉన్న ఆకతాయి వేధిస్తుంటే ఆ మహిళ తెలివిగా ఏం చేసారో తెలుసా?

by Anudeep

Ads

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటారు . కానీ ప్రస్తుతం సమాజంలో దానికి పూర్తి విరుధ్దంగా జరుగుతుంది.  ప్రతి సెకనుకి ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులు ఎదుర్కొంటునే ఉన్నారు . ఎంతటి కఠినతరమైన చట్టాలు వచ్చినప్పటికి వేధింపులు ఆగకపోగా , ఆకతాయిలు మరింత హెచ్చుమీరుతున్నారు. తన నంబర్ ఇవ్వాలంటూ వేధిస్తున్న ఆకతాయిలకు కూర్చున్న చోటు నుండి కదలకుండా బుద్ది చెప్పింది ఒక మహిళ . ఎలాగో చదవండి.

Video Advertisement

ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల్లో ధైర్యాన్ని , పోలిసులంటే నమ్మకాన్ని కలిగిస్తుంది. అసలేం జరిగిదంటే ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. తను కూర్చున్న సీటు వెనుక సీట్లో ఇద్దరు కుర్రాళ్లు కూర్చున్నారు .   ఇద్దరు కుర్రాళ్లు  ఆ అమ్మాయిని టీజ్ చేయడం స్టార్ట్ చేశారు . పేరు చెప్పమంటూ,ఫోన్ నంబర్ ఇవ్వమంటూ  పదే పదే అడుగుతూ వేధించారు. సదరు మహిళ భయంతో బస్సులోనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా యూపీ పోలీసులకు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో  ‘ఇది నా టికెట్.. బస్సు నెంబర్ అంటూ ఫొటో తీసి ట్వీట్‌కు యాడ్ చేసింది . ఆ అమ్మాయి చేసిన ట్వీట్ కి యుపి పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు.

యూపీలోని ఏదైనా 112 ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా కోరుతూ మహిళ ట్వీట్ కు పోలీసులు బదులిచ్చారు. ఆ తర్వాత తాను ప్రయాణించే బస్సు ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ షేర్ చేయమని పోలీసులు మరో ట్వీట్ చేశారు. తన లొకేషన్ ని షేర్ చేసింది బాదిత మహిళ . వెంటనే మహిళ లొకేషన్‌తో పాటు అయోధ్య పోలీసు, బరబంకి పోలీసు ట్విట్టర్ అకౌంట్లను కూడా యూపీ పోలీసులు ట్యాగ్ చేశారు.

యూపీ పోలీసుల ట్వీట్లతో లోకల్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. బస్సు లొకేషన్ ని గుర్తించి , అక్కడికి చేరుకుని బస్ ని నిలిపివేశారు . ఏం జరుగుతుందో డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర ప్రయాణికులకు తెలియక విస్తుపోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు మహిళ మరోసారి జరిగినదంతా వివరించింది. పోలీసులు ఆ ఇద్దరు యువకులను విచారించి, అరెస్ట్ చేశారు . యూపీ పోలీస్ కి థ్యాంక్యూ , వాళ్లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ మరో ట్వీట్ చేసింది ఆ మహిళ .

సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది..ఆపదలో ఉన్నాను హెల్ప్ చేయండంటూ ట్వీట్ చేయగానే రెస్పాండ్ అయిన యుపి పోలీసులను  నెటిజన్లు థాంక్స్ చెప్తు రిప్లై ట్వీట్స్ చేశారు. సోషల్ మీడియా , స్మార్ట్ ఫోన్ల ద్వారా హాని మాత్రమే కాదు , సరిగా వినియోగిస్తే ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయి అంటూ మరోసారి నిరూపితమైంది .


End of Article

You may also like