Ads
జబర్దస్త్ షో ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లలో సుడిగాలి సుదీర్ ఒకరు. అతను ఇప్పటికే సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు కాలింగ్ సహస్ర పేరుతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. అలాగే ఇందులో హీరోయిన్ గా డాలీషా అనే కొత్త అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సినిమాలో ఈమె నటన పర్వాలేదు అనిపించుకుంది.
Video Advertisement
అయితే ఈ మధ్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న డాలీషా తన పర్సనల్ విషయాలని చెప్తూ కన్నీళ్లు పెట్టించింది. చాలామంది సినీ తారల జీవితాలు ఎంతో కంఫర్ట్గా ఎంతో లగ్జరీగా ఉంటాయి అనుకుంటాము కానీ ఆ వెనుక వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ల జీవితాల్లో లోతులు గురించి మనకు తెలియదు. అలాంటి కన్నీటి కధే హీరోయిన్ డాలీషా జీవితంలో కూడా ఉంది.
మధ్యప్రదేశ్ కు చెందిన డాలీషా మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. చిన్నతనంలోనే తండ్రి దూరమవుటంతో ఆమె సంపాదనతోనే కుటుంబం గడవలసిన పరిస్థితి ఏర్పడింది ఆమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు ఎదిగిన తర్వాత అతను కూడా సంపాదించడం ప్రారంభించాడు. మోడలింగ్ కోసం డాలీషా హైదరాబాద్ వస్తే ఆమె తమ్ముడు ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్ళాడు.
అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో ఆమె తమ్ముడు ఒకసారి ఫోన్ చేసి తనకు ట్రాన్స్ జెండర్ ఫీలింగ్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పాడట. అయితే అందుకు డాలీషా ఒప్పుకోలేదట. అయినా అతను వినకుండా ఆపరేషన్ చేయించుకొని లెహర్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. మూడు నెలల కిందటే తన తమ్ముడు చెల్లిగా మారిపోయిందని ఈ విషయం గా అమ్మ చాలా బాధపడుతుందని చెప్పుకొచ్చింది అయితే నేను కూడా బాధపడటం కరెక్ట్ కాదని భవిష్యత్తులో ట్రాన్స్ జెండర్ కోసం ఏదైనా మంచి పని చేస్తానని చెప్పుకొచ్చింది డాలీషా.
End of Article