మళ్ళీ ఎటాక్ చేసిన బర్డ్ ఫ్లూ…ఈ సమయంలో చికెన్ , గుడ్లను తినొచ్చా.? ఎలా తినాలి.?

మళ్ళీ ఎటాక్ చేసిన బర్డ్ ఫ్లూ…ఈ సమయంలో చికెన్ , గుడ్లను తినొచ్చా.? ఎలా తినాలి.?

by Anudeep

Ads

2020 ఏడాదంతా వైరస్ ల ఏడాది లా గడిచింది. కరోనా పోయింది రా అనుకుంటే.. గోడక్కొట్టిన బంతి తిరిగొచినట్లు కొత్త స్ట్రెయిన్ రూపం లో మళ్ళీ వచ్చింది. ఇది చాలదు అన్నట్లు అంతకుముందెప్పుడో పోయింది అనుకున్న బర్డ్ ఫ్లూ వైరస్ మళ్ళీ వస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసిరింది తెలుస్తోంది. కేరళ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి పౌల్ట్రీ పరిశ్రమ తలకిందులైపోతోంది.

Video Advertisement

bird flu

ఉన్నట్లుండి కోళ్లు, బాతులు మృత్యువాత పడుతుంటే పౌల్ట్రీ యజమానుల్లో గుబులు పెరుగుతోంది. గడచిన వారం రోజుల్లో దాదాపు పన్నెండు వేల బాతులు చనిపోయాయని సమాచారం. ఈ బర్డ్స్ తాలూకు శాంపిల్ ను ఇప్పటికే ల్యాబ్ లకు పంపించి టెస్ట్ చేయించారట. వీటిలో ఏవియన్ ఫ్లూ కారక H5N8  వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ రాష్ట్రము లో బర్డ్ ఫ్లూ హెచ్చు మీరడం తో కిలోమీటర్ల పరిధి లో ఉన్న బాతుల్ని, కోళ్ళని చంపేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాపిడ్ యాక్షన్ బృందాలను కూడా రంగం లోకి దించారు.

bird flu virus

ఈ క్రమం లో ప్రజల్లో అనేక ఆందోళనలు నెలకొన్నాయి. చికెన్ లను, కోడి గుడ్లను తినడం సురక్షితమా కాదా అన్నభయాందోళనలు నెలకొన్నాయి. బర్డ్ ఫ్లూ లో H5N1   అనే వైరస్ సహజం గానే ఉంటుంది. కానీ ఇది పక్షులకి, మనుషులకి ప్రాణాంతకం. పక్షులనుంచి మనుషులకు సోకుతుంది. 1997 లో మొదటిసారి మనుషుల్లో కూడా ఈ వైరస్ ని గుర్తించారు. ఈ వైరస్ మనుషులకి కూడా వ్యాప్తి చెందింది. అప్పట్లోనే 60 మంది ప్రాణాలొదిలేసారు. అందుకే ఇలాంటి సమయం లో జాగ్రత్త గా ఉండాలి. కోడి మాంసం మానేయాల్సిన అవసరం లేదు. కానీ తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకు వచ్చిన తరువాత, చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే, గుడ్లను, చికెన్ ను బాగా ఉడకపెట్టాలి. కోడిమాంసం వండేడప్పుడు 165 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించాలి. అపుడు ఈ వైరస్ ప్రభావం ఉండదు. లేదంటే, డెబ్భై డిగ్రీల వద్ద ముప్పై నిమిషాల పాటు ఉడికించి తింటే ఎలాంటి ప్రభావం ఉండదని వైద్యులు చెబుతున్నారు.


End of Article

You may also like