Ads
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మరింత చేరువ అవుతుంది. మనుషులు మన మధ్య లేకున్నా వారి జ్ఞాపకాలను ఫోటోల ద్వారా అందరితో పంచుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలలో సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీల ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తూ ఉంటాయి.
Video Advertisement
తాజాగా.. సోషల్ మీడియా లో ఈ కింద ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..? అలనాటి అందాల తార.. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా.. లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకుంది.
గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు అందాల నటి సౌందర్య. సౌందర్య చాలా తక్కువ సమయంలోనే మంచి నటిగా ఎదిగారు. కానీ.. చిన్న వయసులోనే ఆమె ఈలోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఆమె తెలుగులోనే కాదు.. కన్నడం, తమిళం, మలయాళం, హిందీ వంటి ఇతర భాషా చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. 12 సంవత్సరాల సినీ కెరీర్ లో దాదాపు వంద సినిమాలలో నటించింది.
End of Article