ఈ ఫోటోలో మార్క్ చేసి ఉన్న అబ్బాయి మనందరికీ బాగా తెలిసిన హీరో..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో మార్క్ చేసి ఉన్న అబ్బాయి మనందరికీ బాగా తెలిసిన హీరో..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నటులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతోనే వస్తారు. తమ కుటుంబానికి చెందిన వాళ్లు సినిమాల్లో నటులుగా, లేకపోతే ఇతర విభాగాలలో రాణిస్తూ ఉంటారు. వారిని చూసి స్ఫూర్తి చెంది వీళ్ళు కూడా ఇండస్ట్రీ లోకి వెళ్తారు. హీరోలుగా, హీరోయిన్లుగా మాత్రమే కాకుండా, ఇతర నటులుగా, లేకపోతే ఇతర విభాగాల్లో ఇలా వారసత్వంతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వారసత్వంతో వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో, వారసత్వం లేకుండా వచ్చిన వాళ్ళు కూడా అంతే ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు.

Video Advertisement

can you spot hero in this picture

వాళ్లు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, ఒక్కొక్క మెట్టు ఎక్కి, ఇప్పుడు వారి రంగాలలో వాళ్లు టాప్ వ్యక్తులుగా గుర్తింపు పొందారు. ఈ పైన ఫోటోలో మార్క్ చేసి ఉన్న వ్యక్తి కూడా అలా సినిమా ఇండస్ట్రీ నేపథ్యం లేకుండా వచ్చి, ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో అయ్యారు. ఎంతో మంది ఆయనని తమ సొంత వ్యక్తి లాగా అనుకుంటారు. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి హీరో నాని. ఇది నాని చిన్నతనంలో తీసుకున్న ఫోటో. కింది వరుసలో చేయి ఎత్తి హాయ్ చెప్తున్నట్టు నాని కూర్చొని ఉన్నారు. ఇటీవల నాని చేసిన సినిమాలు అన్నీ కూడా విజయాలు సాధిస్తున్నాయి. జాతీయ వ్యాప్తంగా నాని గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

పాత్రకి తగ్గట్టుగా నటిస్తూ, ప్రతి రోల్ కోసం తనని తను మార్చుకుంటూ, నాచురల్ స్టార్ గా గుర్తింపు సంపాదించారు. నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గతంలో అంటే సుందరానికి సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమాలో నాని సూర్య అనే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. వారంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా డైరీలో రాసుకొని, తనకి ఇబ్బంది కలిగించిన వారిని శనివారం రోజు కొట్టడం చేస్తూ ఉంటారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది అంటూ టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన నాని బర్త్ డే స్పెషల్ టీజర్ లో, నానితో పాటు ఎస్ జె సూర్య కూడా కనిపించారు

ALSO READ : ప్రభుదేవాకి పోటీగా డాన్స్ చేసింది… ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు..! ఎవరంటే..?


End of Article

You may also like