ప్రభుదేవాకి పోటీగా డాన్స్ చేసింది… ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు..! ఎవరంటే..?

ప్రభుదేవాకి పోటీగా డాన్స్ చేసింది… ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు..! ఎవరంటే..?

by Mohana Priya

Ads

భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డాన్సర్స్ లో ప్రభుదేవా ఒకరు. సాధారణంగా ప్రభుదేవా డాన్స్ వేస్తూ ఉంటే పక్కన ఇంకొకరి డాన్స్ కనిపించదు. కళ్ళు అన్నీ కూడా ప్రభుదేవా మీదే ఉంటాయి. ప్రభుదేవాతో పాటు కొన్ని వందల మంది డాన్స్ వేస్తున్నా కూడా వాళ్ళు ఎవరిని చూడలేము. ఇటీవల తమిళ్ హీరో విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలోని ఒక సాంగ్ విడుదల అయ్యింది. విజిల్ పోడు అనే ఈ పాటలో ప్రభుదేవా కూడా కనిపిస్తున్నారు. ఈ పాటలో కూడా ప్రభుదేవా డ్యాన్స్ కనిపిస్తోంది. ప్రభుదేవా చిన్న మూమెంట్ చేసినా కూడా చూపు ప్రభుదేవా చేసే స్టెప్స్ మీదే ఉంటుంది.

Video Advertisement

heroine who danced with prabhudeva

ఆయన డాన్స్ వల్ల అందం వచ్చిన పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి ప్రభుదేవాకి పోటీగా ఒక అమ్మాయి డాన్స్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. ఈ పాట తెలుగు పాట కాదు. ఒక కన్నడ పాట. అయినా కూడా తెలుగులో ఈ పాట చాలా మంది విని ఉంటారు. అమ్మాయి డాన్స్ ని మెచ్చుకొని ఉంటారు. కరకట దమనక అనే ఒక కన్నడ సినిమాలో ప్రభుదేవా నటించారు. ఈ సినిమా నుండి హితలక కరీబ్యాడా అనే ఒక పాట విడుదల అయ్యింది. ఈ పాటలో ప్రభుదేవాతో పాటు ఒక అమ్మాయి డాన్స్ చేశారు. ఆ అమ్మాయి ఈ సినిమాలో నటించిన ఇంకొక హీరోయిన్.

heroine who danced with prabhudeva

ఆమె పేరు నివిష్క నాయుడు. 2018 లో వచ్చిన అమ్మ ఐ లవ్ యు అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. నివిష్క బెంగళూరులో ఉన్న మౌంట్ కార్మెల్ కాలేజ్ లో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. బెంగళూరులోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిశారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు. అంతర్జాతీయ వ్యాప్తంగా చాలా మందికి నివిష్క పరిచయం అయ్యారు. ఈ పాటలో నివిష్క ఎక్స్ప్రెషన్స్ కూడా హైలైట్ గా నిలిచాయి. ప్రభుదేవాకి సమానంగా డాన్స్ చేయడంతో పాటు, పాటకి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇప్పుడు వేరే భాషల నుండి కూడా ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తారేమో. వేచి చూడాల్సిందే.

watch video :


End of Article

You may also like