Ads
తెలంగాణ ఎన్నికల పరిణామం ఎన్నడు ఎవరు ఊహించని విధంగా వచ్చింది. మార్పు కావాలి అంటూ ఒకపక్క అంటూ 6 గ్యారంటీల ఆశ చూపించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం గులాబీ వికాసం పై ఇవి ఏవి ప్రభావం చూప లేకపోయాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో 64 స్థానాలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. మరోపక్క గ్రేటర్ పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాలలోని ఏడు స్థానాలలో కారు స్పీడ్ కొనసాగింది. ఎప్పటిలాగా గోషామహల్ లో రాజాసింగ్ హ్యాట్రిక్ విక్టరీ తో వచ్చిన ఒకే ఒక సీటు బిజెపి ఖాతాలో సురక్షితంగా చేరింది.
Video Advertisement
కుత్బుల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి వివేకానంద గౌడ్.. 85వేల 576 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించాడు.
కూన శ్రీశైలం గౌడ్‌పై వివేకానంద వార్ వన్ సైడ్.. కాదు .. కాదు.. కారు వన్ సైడ్..అనేది రేంజ్ లో గెలుపు సాధించాడు. తమ పార్టీ అందించిన సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా.. సీమాంధ్ర ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడంలో వివేకా సక్సెస్ అయ్యాడు. తెలంగాణలో మూడవసారి జరిగిన ఎన్నికల్లో వివేకానంద టాప్ స్కోరర్గా నిలబడడమే దీనికి నిదర్శనం.
మరోపక్క హరీష్ రావు 82వేల 308 ఓట్ల మెజార్టీ సాధించి టాప్ స్కోరర్ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నాడు. గత ఎన్నికల్లో ఆయనకు లక్షకు పైగా మెజారిటీ వచ్చింది. ఇక కూకట్పల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 70వేల 387 ఓట్ల మెజారిటీ తో గెలిచాడు. కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం అత్యధిక మెజార్టీ రికార్డును సొంతం చేసుకున్నాడు.బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై వేముల వీరేశం 68వేల 839 ఓట్లతో గెలిచాడు. మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 66 వేల 116 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ రామగుండంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ 56 వేల 352 భారీ మెజార్టీతో పై గెలిచారు.
End of Article