ఉద్యోగాలనుండి తీసేస్తారేమో అని అందరు కంగారుపడుతున్న వేళ… ఆ కంపెనీ జీతాలు పెంచింది!

ఉద్యోగాలనుండి తీసేస్తారేమో అని అందరు కంగారుపడుతున్న వేళ… ఆ కంపెనీ జీతాలు పెంచింది!

by Anudeep

Ads

వావ్ బంపర్ ఆఫర్ కొట్టడం అంటే ఇదేనేమో..ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అని అందరూ టెన్షన్ పడుతుంటే , కాప్ జెమిని కంపెనీ వాళ్లకి మాత్రం ఏకంగా జీతాలు పెంచేసింది..కరోనా కష్టకాలంలో ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. దాంతో రెండు నెలలుగా అందరూ టెన్షన్లోనే ఉన్నారు.. కానీ కాప్ జెమిని జీతాలు పెంచుతున్నామని అనౌన్స్ చేసి ఉద్యోగులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

Video Advertisement

 

ఫ్రెంచ్ ఐటి సర్విసెస్ కంపెని  క్యాప్ జెమినీ ఐటీ కంపెనీలో మన దేశంలో ఒక లక్షా ఇరవైవేలు (120,000). వారిలో 70 శాతం మందికి అంటే సుమారు 84000 మందికి ఏప్రిల్ 1,2020నుంచి నుంచి జీతాలు పెంచాలని నిర్ణయించింది సంస్థ యాజమాన్యం. మిగిలిన ఉద్యోగులకు కూడా జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ ఒక్క వార్తతో సుమారు రెండు నెలల నుండి ఉన్న టెన్షన్ అంతా పక్కకి పోయి ఉద్యోగులంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు. . మార్చిలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి, విషయం బయటకు తెలిసే సరికి కాస్త ఆలస్యం అయింది.

అంతే కాదు  లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు 10,000 రూ. క్యాష్ అలవెన్స్ కూడా ప్రకటించింది .ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి మాత్రమే కాకుండా బెంచ్ ఉద్యోగులకు కూడా ఈ కంపెనీ జీతాలను అందిస్తుంది.ప్రాజెక్టులు లేని బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను నిలుపుకునేందుకు వీలుగా వారికి కూడా జీతాలు చెల్లించాలని నిర్ణయించిందట.వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సును ఇవ్వాలనే నిర్ణయంతో 95% మంది ఉద్యోగులు లాభపడనున్నారు . ఇక ఏప్రిల్ లో ఉధ్యోగులకు ఇవ్ల్సిన ప్రమోషన్లు జూలై 1 నుంచి అమలు చేస్తారట.

కాప్ జెమిని ప్రకటించిన విషయాలతో  ఆన్లైన్లో ఈ కంపెని గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు..ఇలాంటి కంపెనిలో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఉంటే, కొన్ని సంస్థలు సగం జీతాలిచ్చి చేతులు దులుపుకున్నాయి. మరికొన్న సంస్థలు ఉద్యోగాలు కూడా కష్టమే అని తేల్చేసిన పరిస్థితి. ఆఖరికి టిసిఎస్ కూడా ఈ ఏడాది ఇంక్రిమెంట్లు ఇవ్వం అని, ఉద్యోగాలకు ఢోకాలేదని ప్రకటించింది. పెంచేదే తక్కువ ఇంక్రిమెంట్  అది కూడా లేకుండా ఏడాది అంతా పని చేయాలంటే కష్టం అని టిసిఎస్ ఉద్యోగులు వాపోతున్నారు.


End of Article

You may also like