బంపర్ ఆఫర్ కొట్టాననుకుంది ఆ సికింద్రాబాద్ మహిళ…! చివరికి ఏమైందో తెలుసా..?

బంపర్ ఆఫర్ కొట్టాననుకుంది ఆ సికింద్రాబాద్ మహిళ…! చివరికి ఏమైందో తెలుసా..?

by Anudeep

Ads

ఎట్టెట్టా ఇయర్ ఫోన్స్ కొంటే కారొచ్చిందా? ఇయర్ ఫోన్స్ ధర కనీసం ఒక వెయ్యేసుకున్న లక్షలు విలువ చేసే కారు.. అదృష్టం అంటే వాళ్లదే . మొన్నొకతనికి గూగుల్ పే లో డబ్బులు పంపితే లక్ష రూపాయలొచ్చాయి . మరొకరికి లాటరీ టికెట్లో కోటి తగిలాయి . ఇట్టాంటి అధ్బుతాలన్ని మన జీవితంలో ఎందుకు జరగవు . ఛీ వెధవ జీవితం . అదృష్టం ఎప్పుడూ మన తలుపు తట్టదు. అయిపోయిందా? మీరు బాధ పడడం అయిపోయిందా? టైటిల్ చదివేసి ఓహ్ తెగ బాధపడే కంటే కంప్లీట్ న్యూస్ చదవండి . మీకు కుచ్చుటోపి పెట్టనందుకు మీ  అదృష్టాన్ని మీరే మెచ్చుకుంటారు.

Video Advertisement

సుధది సికింద్రాబాద్ దగ్గర తుకారంగేట్ . మొన్నీమధ్య హెడ్ సెట్ కొనుక్కుందామని షాప్ క్లూస్ లో ఆర్డర్ పెట్టింది. హెడ్ సెట్ రేటు 500రూపాయలు. హెడ్ సెట్ వచ్చింది. తర్వాత షాప్ క్లూస్ నుండి ఆమెకి ఫోన్ వచ్చింది. ఇయర్ ఫోన్స్ కొన్న వివరాలను చెప్పి, హెడ్ సెట్ కొనుక్కున్నందుకు లక్కీ డిప్లో మీకు కార్ బహుమతిగా వచ్చిందనేది ఆ ఫోన్ సారాంశం.మొదట ఆటపట్టిస్తున్నారనుకున్న సుధ, వరుసగా రెండు రోజుల పాటు కాల్స్ వచ్చేసరికి 12 లక్షల విలువ చేసే కార్ అంటే మాటలా? అప్పుడప్పుడు టివిల్లో చూస్తుంటాం గా, నాకు కూడా అదృష్టం వరించిందేమో అని వాళ్ల మాటలు నమ్మేసింది.

మనోళ్లు తక్కువ తినలేదు.. మీకు కారు కావాలంటే కారు , లేదంటే డబ్బు డిపాజిట్ చేస్తామని నమ్మబలికారు . తనంతట తానే వచ్చిన అదృష్టాన్న ఎందుకు కాళ్ల తన్నుకోవడం అని , ఏం చేయాలి అని అడిగింది. అంతే తంతే బూరల బుట్టెలో పడ్డట్టయింది మన మాయగాళ్ల పరిస్థితి. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేస్కోవాలన్నారు.

రిజిస్ట్రేషన్ ఫీజు 7500 రూపాయలు, అవి చెల్లిస్తే మీ కార్ లేదంటే డబ్బు మీకు డబ్బుని డిపాజిట్ చేస్తామన్నారు. 7500 రూపాయలు చెల్లించడానికి రెండు బ్యాంక్ అకౌంట్ నంబర్లను కూడా ఇచ్చారు. సుధ వెంటనే 7500రూపాయలని వాళ్ల అకౌంట్లో వేసింది. అక్కడితో ఆగకుండా జిఎస్టీ, ఆర్టీవో, ఇన్సూరెన్స్ అంటూ 68,900 వసూలు చేశారు. కారు అంటే ఆ మాత్రం ఖర్చుంటుంది కదా.

ఫోన్ చేసిన పని అయిపోయింది. ఫోన్ కూడా స్విఛ్చాప్ అయింది. అవ్వలేదు ఫోన్ స్విచ్చాప్ చేశారు. సుధకి ఏ నంబర్లనుండి కాల్ చేశారు, ఆ నంబర్లు స్విఛ్చాప్. ఎన్ని సార్లు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేకపోయేసరికి , అప్పుడు అర్దం అయింది తాను మోసపోయానని, చేసేదేం లేక సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించింది.

సుధ ఇచ్చిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు . ఆ బ్యాంక్ అకౌంట్లు కలకత్తాకి చెందినవి . ఇంకేముంది కథ కలకత్తాకి, సుధ ఇంటికి.సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎన్ని రకాలుగా అప్రమత్తం చేసినప్పటికి కొందరు వాళ్ల బుట్టలో పడుతూనే ఉన్నారు,మోసపోతూనే ఉన్నారు. 70,000 పోగొట్టుకుని తను అంత బాధపడుతుంటే మీకు తమాషాగా ఉందా అనిపించొచ్చు .

కానీ ఒక్కసారి ఆలోచించండి 500 రూపాయల హెడ్సెట్ కి ఎవరైనా 12 లక్షల విలువ చేసే కార్ ఇస్తాడా? ఒక వేళ ఇస్తున్నడనుకున్న కంపెనీకి కానీ,సంబంధిత అధికారులకి కాని సంప్రదించి ప్రోసీడ్ అవ్వకుండా ఒక చిన్న ఫోన్ కాల్ ఆధారంగా ఎలా నమ్మేస్తారు . మోసపోయేవాళ్లున్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు.

note: image used is just for reference but not the actual characters.


End of Article

You may also like