Ads
బుల్లితెర సంచలనం…స్టార్ యాంకర్ ‘శ్రీముఖి’ అందం అభినయం రెండు ఉన్న ఈ బ్యూటీ ప్రముఖ చానెల్స్ లోని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా మరియు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు..ఇటీవలి ఒక షో లో చేసిన కామెంట్స్ బ్రాహ్మణులని కించపరిచేలా ఉన్నాయంటూ నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.శర్మ గారి ఫిర్యాదు మేరకు సదరు ఆ ప్రముఖ ఛానల్ వారి పైన కూడా కేసు బుక్ చేసారు పోలీసులు ..ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియ రావాల్సి ఉంది
Video Advertisement
ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.మరి ఈ విషయం మీద శ్రీముఖి ఎలా స్పందిస్తారో…చూడాలి యాజమాన్యాలు కూడా అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ నెటిజన్స్ వాపోతున్నారు.ఇలాంటి వివాదమే ఇంతకు ముందు కూడా జబర్దస్త్ కమెడియన్స్ కి ఎదురు పడ్డాయి.నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఇలాంటి పొరపాట్లు ఎక్కడో ఒక చోట వస్తూనే ఉన్నాయి.ఇక నైనా సదరు నిర్మాతలు జాగ్రత్తగా వ్యవహరిస్తే అందరికి మంచిది సరదాకోసమో..ఎంటెర్టైనమెంట్ బేస్ చేసుకునే ఇలాంటివి జరిగితే ఎవరికైనా ఇబ్బందే మరి.ఇకపోతే గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న రాములమ్మ అదే నండి శ్రీముఖి రన్నరప్ గా నిలిచారు.
source: sakshi
End of Article