“చంద్రబాబు నాయుడు” కి మరో షాక్… హైదరాబాద్‌లో కేసు నమోదు..! ఏం జరిగిందంటే..?

“చంద్రబాబు నాయుడు” కి మరో షాక్… హైదరాబాద్‌లో కేసు నమోదు..! ఏం జరిగిందంటే..?

by Mounika Singaluri

Ads

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి 53 రోజుల తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అమరావతి లోని ఆయన నివాసానికి టిడిపి అభిమానుల ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

Video Advertisement

తాజాగా వైద్య పరీక్షలు కోసం గన్నవరం నుండి బేగంపేట ఎయిర్ పోర్ట్ కి వచ్చిన చంద్రబాబు అక్కడి నుండి తన కాన్వాయ్ లో ర్యాలీగా తన నివాసం ఉన్న జూబ్లీహిల్స్ కు చేరుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు చంద్రబాబు నాయుడు పైన కేసు నమోదు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేదు. పోలీసుల అనుమతి తీసుకోకుండా చంద్రబాబు కారు ర్యాలీ నిర్వహించినందుకు ఎస్సై జయశంకర్ ఫిర్యాదు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు ర్యాలీ సందర్భంగా రోడ్డుపై జనం ఇబ్బందులకు గురయ్యారని కంప్లైంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 341, 290,21 రెడ్ విత్ 76సిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీలో సుమారు 400 మంది వరకు పాల్గొన్నారు.నగరంలో ట్రాఫిక్ సమస్య కలిగించినందుకు టిడిపి హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ జివిజి నాయుడు పై కూడా కేసు బుక్ చేశారు. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ర్యాలీకి అనుమతి పొందాలని పోలీసులు తెలిపారు. 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ర్యాలీకి పర్మిషన్ తీసుకోవాలని అవేం పాటించకుండా రోడ్లపై వాహనాలతో ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ఎన్నికల కోడ్ సైతం పాటించలేదని పోలీసులు తెలిపారు.

ఇక గురువారం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఏఐజి ఆసుపత్రికి చెందిన వైద్యులు ఆయన నివాసానికి చేరుకుని హెల్త్ కండిషన్ చెక్ చేశారు. తర్వాత చంద్రబాబు ఎల్వి ప్రసాద్ హాస్పటల్లో కంటి పరీక్షలు చేయించుకున్నారు.

Also Read:అయ్యప్ప మాల ధరించినందుకు పనిష్మెంట్ ఇచ్చారా..? ఇదెక్కడి వింత..?


End of Article

You may also like