మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ గా విడుదల అయింది. మెహర్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, చిరంజీవి పక్కన హీరోయిన్ గా తమన్నా నటించింది. హీరోయిన్ కీర్తి సురేశ్ చెల్లెలిగా నటించింది.
తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి అంతగా టాక్ రాలేదు. చిరంజీవి ఈ మూవీ కోసం ఎంత కష్టపడినా మెహర్ రమేశ్ దర్శకత్వం పై ఘాటు విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మీమ్స్ తో ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల నుండి తెలుగులో తవ హీరోగా కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలలో భారీ డిజాస్టర్ గా నిలిచిన మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ తర్వాత ఆ రేంజ్లో ‘భోళా శంకర్’ పై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ పైనే ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఆడియెన్స్, నెటిజన్లు ఈ మూవీని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
అసలు మూవీలో మెగాస్టార్ చిరంజీవికి రేంజ్‌కు తగిన సన్నివేశాలు లేవని, క్రింజీగా ఉందని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో జబర్దస్త్ నటుల కామెండీ కానీ, శ్రీముఖి నడుము సన్నివేశం సెట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే భోళా శంకర్ మూవీలోనీ సీన్స్ ను రకరకాల మీమ్స్ ను తయారు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
జాతిరత్నాలు అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ మూవీలోనీ కీర్తి సురేష్ ఫోటోను షేర్ చేసి, అదేంటి ఏదో డీవీడీ ప్లేయర్ కి కనెక్ట్ చేసినట్టు ఆ వైర్లు ఏంటి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో ఆమెకు తలకు సర్జరీ చేసినట్టు చూపించారు. కానీ ఆమెకు హెయిర్ తీయలేదని, పైగా తలకు వైర్లు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/Cv1l0utPd18/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

తాను సినిమాలలో నటించడానికి ప్రయత్నించలేదని, అది నిజం కాదని చెప్పడం కోసం జయలలిత ఆ లెటర్ లో తనకు వచ్చిన ఒక పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విషయన్ని ఆ లేఖలో తెలిపింది. 1980లో రిలీజ్ అయిన ‘బిల్లా’ మూవీలో తనకు ఆఫర్ వచ్చిందని, అది కూడా దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ అని, ఆ మూవీలో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ సినిమాలో ముందుగా తనకే ఆఫర్ చేశారు.
తాను సినిమాలలో నటించాలనుకుంటే రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ ను వదులుకునేదాన్ని కాదు అని రాసుకొచ్చారు. తాను ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశాన్ని శ్రీప్రియకు బాలాజీ ప్రొడక్షన్స్ ఇచ్చిందని ఆ లెటర్ లో జయలలిత వివరించారు.
అంతే కాకుండా ఈ విషయాన్ని బాలాజీ కూడా పబ్లిగ్గానే వెల్లడించారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారో అర్థం కావట్లేదని, ఆ భగవంతుడి దయ వల్ల ఆర్థికంగా తనకి ఎలాంటి కష్టాలు లేవని, తన దృష్టి వేరే వైపు ఉందని, ఇక పై సినీ కెరీర్‌ను కొనసాగించడంలో తనకు ఆసక్తి లేదని జయలలిత ఆ లెటర్ లో తెలిపారు.
1. రుద్రవీణ:
2. స్వయంకృషి:
3. ఆపద్బాంధవుడు:
4. చంటబ్బాయి:
5. విజేత:
6. జగదేక వీరుడు అతిలోక సుందరి:
7. ముఠా మేస్త్రి:
8. సైరా:
9. ఇంద్ర:
10. అభిలాష:
11. ఛాలెంజ్:
12. యముడికి మొగుడు:
యాంకర్ ఓంకార్ స్థిరపడిన తరువాత హిందీ టీవీ డ్యాన్స్ షోలు మాత్రమే ఉన్న సమయంలో వాటి మాదిరిగానే ఒక కాన్సెప్ట్ తో తెలుగులో డాన్స్ షోను నిర్మించాడు. ఆ షో పేరు ఆట. ఈ షో అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. రెండు సీజన్ల తరువాత ఆట జూనియర్స్ మొదలుపెట్టాడు. దీని అందరూ చిన్నపిల్లలే పోటీ పడతారు. ఈ డ్యాన్స్ షో కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆట జూనియర్స్ 7 వరకు ఈ షో ప్రసారం అయ్యింది.
అయితే ఆట జూనియర్స్ 5 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిట్టు అనే అబ్బాయి, ఒక్క డ్యాన్స్ తో మాత్రమే కాకుండా తన మిమిక్రీతో కూడా ఆకట్టుకున్నాడు. బిట్టు చాలామంది అభిమానచేవారు. ఆట జూనియర్స్ 5 ఎంటర్టైన్మెంట్ ట్రోఫిని అందుకున్నాడు. అతన్ని ఆటబిట్టు అని పిలుస్తుంటారు. ఆ తరువాత ఛాలెంజ్ డాన్స్ షో 3 పాల్గొని విన్నర్ అయ్యాడు.
ఈటీవీలో ప్రసారం అయిన ఆటైనా పాటైనా దేనికైనా రెడీలో పాల్గొన్న బిట్టు విజేతగా నిలిచాడు. ఆ తరువాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన కిరాక్ కిడ్స్ లో కూడా పాల్గొన్నాడు. వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు పెద్దగా యిన బిట్టు డ్యాన్సర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.
















పైన ఫోటోలో సైకిల్ మీద కూర్చున్న చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాకుండా ఇతని తమ్ముడు కూడా హీరోనే. అతని తండ్రి టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. ఈ హీరో తండ్రి నాన్న కూడా ఒకప్పుడు తెలుగులో ప్రముఖ నటుడిగా రాణించి, కాలం చేశారు. ఈ హీరో తన స్టైల్ తో ఆకట్టుకుని స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ హీరోకి అమ్మాయిల ఫోలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
కొత్త తరహ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో అమ్మాయిలు వరుగా అపహరణకు గురవుతుంటారు. సుమారు 16 మంది కనిపించకపోవడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం కేరళ నుండి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను సిటీకి రప్పిస్తారు. అప్పటికే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) తో పాటు ఆద్య కూడా విచారణ మొదలుపెడుతుంది.
తప్పిపోయిన అమ్మాయిలకు ఏమైంది? అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో నివసించే గిరిజన తెగ హిడింబాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆద్య, అభయ్ ఈ కేసును చేధించారా? అనేదే మిగతా కథ. ఎంచుకున్న కథ ఎంత గొప్పది అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా ఆడియెన్స్ కి అర్థం కాకపోతే ఆ మూవీతో కనెక్ట్ కాలేరు. ఈ మూవీలో అదే జరిగింది.
నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ, వర్తమానంలో జరిగే సీన్స్ చూపించడంతో స్టోరీ ఎక్కడ నడుస్తుందో అర్థం కాకపోవడం ఆడియెన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
అసలు స్టోరీ సెకండాఫ్‌లో చూపించారు. హిడింబ తెగ నేపథ్యం, హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు కనెక్షన్ ఉండడం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది. అయితే డైరెక్టర్ పలు చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.
మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇష్టపడని ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈరోజు (ఆగస్టు 11) థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ వేదళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్ళుగా నటించారనే విషయం తెలిసిందే.
భోళా శంకర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదని చెబుతున్నారు. ఇంటర్వెల్ బాంగ్ తో ప్రధమార్ధం పర్వాలేదని అంటున్నారు
అయితే ఈ చిత్రంలో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మధ్యలో పెట్టిన లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని, అలాగే ఖుషి నడుము సీన్ కూడా అంతగా సెట్ అవలేదని, భోళా శంకర్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.