‘అణుబాంబు పితామహుడు’ గా పేరుగాంచిన జె. రాబర్ట్ ఓపెన్హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఓపెన్హైమర్’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇండియాలో కూడా ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్లను సాధించింది.
భారీ అంచనాలతో ఇండియాలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, విజయాన్ని అందుకుంది. కానీ ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో భగవద్గీతలోని శ్లోకం చదవడం వల్ల వివాదానికి దారి తీసింది. దీనిపై భారతీయులు నిరసనలు, ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
బీబీసి న్యూస్ కథనం ప్రకారం, ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓపెన్హైమర్’. ఈ మూవీ జులై 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి, భారీ కలెక్షన్స్ సాధిస్తూ, దూసుకెళ్తోంది. ఇండియాలో కూడా రిలీజ్ అయ్యి, హిట్ అయినప్పటికీ, ఈ మూవీ పై భారతీయుల నుండి విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియాలో మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలోని ఒక అభ్యంతరకర సన్నివేశంలో సైంటిస్ట్ ఓపెన్హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం చదువుతారు. అదే వివాదానికి దారి తీసింది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని శ్లోకాన్ని అభ్యంతరకర సన్నివేశంలో చదవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సైంటిస్ట్ ఓపెన్హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాలలో భగవద్గీత ఒకటని చెప్పారు. భగవద్గీతను చదవడం కోసమే ఆయన సంస్కృతం నేర్చుకున్నారని ఒక సందర్భంలో తెలిపారు. న్యూ మెక్సికోలోని ఎడారిలో తొలిసారి 1945లో జులై నెలలో అణుబాంబును పేల్చడానికి 2 రోజుల ముందు ఓపెన్హైమర్ భగవద్గీతలోని శ్లోకాన్ని చదివారట.
కొన్నేళ్లకు ముందు శాస్త్రవేత్త ఓపెన్హైమర్కు బర్క్లీలోని ఒక టీచర్ సంస్కృత భాషని పరిచయం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోని భగవద్గీత ఓపెన్హైమర్కు పరిచయమైంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతను వరల్డ్ లోనే అత్యంత దీర్ఘ కవితగా పరిగణిస్తారు. అలాంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఓపెన్హైమర్ ప్రపంచ చరిత్రను మార్చే ఒక ఘట్టం మొదలుపెట్టడానికి చదివి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తొలగించుకున్నాడని తెలుస్తోంది.
Also Read: హీరో “వేణు” ది సినిమాల్లో సొంత గొంతు కాదా..? వేణుకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ ఎవరంటే..?




కమెడియన్ యాదమ్మ రాజు పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు, తన భార్య స్టెల్లాతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. అందులో సరదా వీడియోలను ఆడియెన్స్ తో పంచుకుంటాడు. యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
యాదమ్మ రాజు భార్య తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వీడియో యాదమ్మ రాజు హాస్పిటల్లో ఉన్నట్టుగా కనిపించాడు. అతని కాలికి దెబ్బ తగిలి, పెద్ద కట్టుతో ఉన్న రాజు నడవలేని స్థితిలో కనిపించారు. అతని భార్య స్టెల్లా అతనిని నడిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని అడుగుతున్నారు. దాంతో రాజు భార్య స్టెల్లా ఇలా వివరణ ఇచ్చారు.
యాదమ్మ రాజు చిన్నప్రమాదానికి గురయ్యారని, త్వరలో కోలుకుంటారు. మాపై చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు. ఆయన త్వరగా కోలుకోవాలని పంపిన సందేశాలకు కృతజ్ఞతలని స్టెల్లా కామెంట్ చేశారు. గాయపడిన తన భర్తను ఉద్దేశిస్తూ, నీ పక్కన నేను ఉండగా నీకేం కాదు డియర్ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన సినిమా బ్రో. తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో బ్రో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన 2 పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి మూవీ ప్రమోషన్స్ సాగుతున్నాయి. వాటిలో భాగంగా దర్శకుడు సముధ్రఖని, సాయి ధరమ్ తేజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ ఈవెంట్ లో పవర స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ విశేషాల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఎమోషనల్ అయ్యాడు.
చీఫ్ గెస్ట్ గా హాజరు అయిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమాల్లో ఉన్నా, పాలిటిక్స్ లో ఉన్నా మా ఫ్యామిలీ అంతా బాబాయి వెనకే ఉంటాం అని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే బ్రో ప్రీ రిలీజ్ వేడుక పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి విన్నవారు షాక్ అయ్యేవారంట. ఎన్టీఆర్ ఉదయాన్నే అరచేతి మందం ఉండే ఇడ్లీలను 20కి పైగా అవలీలగా తినేవారంట. పొద్దున్నే 6 గంటలు అయ్యేసరికి మేకప్ వేసుకుని సిద్దంగా ఉండేవారు. ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లి పగలు 2 గంటల అనంతరం మరో షూటింగ్ కు వెళ్ళేవారంట.
ఎన్టీఆర్ షూటింగ్ గ్యాప్ లో నిత్యం నాలుగైదు ఆపిల్ జ్యూస్ లు తాగేవారట. సాయంత్రం పూట స్నాక్స్ గా బజ్జీలు కానీ, డ్రై ఫ్రూట్స్ ను కానీ తీసుకునేవారు. ఎన్టీఆర్ రోజుకు 30 – 40 బజ్జీలు తింటుంటే అందరూ ఆయనను ఆశ్చర్యంగా చూసేవారట. ప్రతిరోజూ ఎన్టీఆర్ 2 లీటర్ల బాదం పాలు ఖచ్చితంగా తాగేవారట. అదే ఎండాకాలంలో అయితే ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు వేరే విధంగా ఉండేవట.
ఎండాకాలంలో మధ్యాహ్నం పూట ఎన్టీఆర్ మామిడి పళ్ల జ్యూస్ తో తాగేవారంట. అది మాత్రమే కాకుండా ఆ మామిడి పళ్ల జ్యూస్ లో గ్లూకోజ్ పౌడర్ ను కలిపి తాగేవారు. వైద్యుల సూచనల మేరకు అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ ను ఎన్టీఆర్ తీసుకునేవారట. ఆ ముద్దను ఎన్టీఆర్ షాట్ గ్యాప్ లో తినేవారట. ఎన్టీఆర్ తన కెరీర్లో 300లకు పైగా సినిమాలలో నటించారు. ఆయన హీరోగా నటించే సమేమాలో అత్యధిక పారితోషికం తీసుకునేవారని తెలుస్తోంది.






పమ్మి సాయి అసలు పేరు శ్రీనివాస్ సాయిరామ్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతూరు భీమవరం అనే విషయం తెలిసిందే. పమ్మి సాయి ఊరు కూడా అదే కావడంతో అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిన్నతనం నుండి పరిచయం ఉంది. పమ్మి సాయికి ఆ పరిచయాన్నితోనే సరదాగా మహేష్ బాబు నటించిన ‘అతడు’ మూవీలో త్రివిక్రమ్ మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా సరదాగా మొదలైన పమ్మి సాయి కెరీర్ ప్రస్తుతం కొనసాగుతోంది.
మొదటి ఛాన్స్ ఇచ్చి వదిలిపెట్టకుండా త్రివిక్రమ్ వరుసగా తన చిత్రాలన్నిటిలోనూ పమ్మి సాయికి మంచి పాత్రలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ‘నువ్వే నువ్వే’ సినిమాలో తప్ప పమ్మీ సాయి త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన అన్నిచిత్రాలలో నటించాడు. అలాగే ఇతర డైరక్టర్ల సినిమాలలో కూడా మంచి ఆఫర్స్ లభించాయి. అలా పమ్మి సాయి ఛలో, చల్ మోహనరంగా, శతమానం భవతి, ఎవరు లాంటి సుమారు 60 పైగా సినిమాలలో మంచి కామెడీ పాత్రలు చేశారు.
త్రివిక్రమ్ మూవీ చివరగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని సాధించిన ‘అల వైకుంఠపురంలో పోషించిన పాత్రతో కూడా పమ్మి సాయికి మంచి పేరు తెచ్చింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినపుడు వచ్చే ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపించి నవ్వులు పూయించాడు.
