బుల్లితెర యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇతనికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా మేల్ యాంకర్ చాటుతూ ముందుకు వెళ్తున్నాడు ప్రదీప్.
టీవీ షోస్ లో జరిగే చాలా ప్రోగ్రామ్స్ లో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. ఏదో ఒక ఛానల్లో జరిగే షో కి హోస్ట్ గా ప్రదీప్ ఉండడం సర్వసాధారణమైన విషయం.

30 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి ప్రసక్తి యువ యాంకర్ పెళ్లి గురించి కూడా చాలా సందర్భాలలో వార్తలు వచ్చాయి. పొరపాటున ఏదైనా షోలో అతని పెళ్లి గురించి ప్రస్తావన వస్తే వెంటనే ఏదో ఒకటి చెప్పి మాట మారుస్తాడు. కొన్ని సంవత్సరాలుగా టీవీ ఫీల్డ్ లో మంచి ఆఫర్స్ రావడంతో ప్రస్తుతం అతను బాగానే ఆస్తిపాస్తులు కూడా సంపాదించాడు.

అయితే ప్రస్తుతం ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. రీసెంట్ గా ఒక యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన రెమ్యూనరేషన్ గురించి అడిగినప్పుడు అసలు విషయం చెప్పకుండా మాట మార్చాడు. ఆతని రెమ్యూనరేషన్ సుమారు మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుందట.

అంటే ఒక నెలకి ప్రదీప్ సుమారు 30 కోట్ల వరకు సంపాదిస్తాడన్నమాట.ఇప్పటికే కొన్ని వేల కోట్ల ఆస్తులు ప్రదీప్ సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. మణికొండ లో ఒక విల్లాతో పాటు లగ్జరీ కార్లు మరియు బైకులు కూడా ప్రదీప్ కలెక్షన్లో ఉన్నాయట. ఒక టీవీ యాంకర్ గా ఉంటూ ఇన్ని ఆస్తులు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా.
ALSO READ : స్టోరీ కూడా వినకుండా… “బేబీ” మూవీ వద్దు అన్న హీరో ఎవరో తెలుసా..?

తరుణ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘అశ్విన్స్’. ఈ మూవీని విరూపాక్ష ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై నిర్మించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) ఇద్దరు భార్యభర్తలు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, గ్రేస్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. ఈ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం పైన ఒక ఎపిసోడ్‌ను షూట్ చేయడం కోసం లండన్‌లో ఒక దీవిలో ఉండే బంగ్లాలోకి వెళ్తారు.
ఆ బంగ్లాలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ ఉందని, అక్కడి వెళ్లిన 15 మందిని చంపిందనే ప్రచారం ఉంటుంది. అర్జున్ టీమ్, ఆ బంగ్లాలో తిరిగే ఆత్మలను, అరుపులను కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఆ బంగ్లాలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఏంటి? ఆర్తి రాజగోపాల్ ఎలా మరణించింది? అసలు ఆ బంగ్లాలో ఏముంది? అశ్వినీ దేవతలు ప్రసాదించిన బొమ్మలు కనుగొన్న ఆర్తి రాజగోపాల్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనవాళ్లను రక్షించుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అనేది ‘ఆశ్విన్స్’ కథ.
మంచి, చెడు రెండింటినీ నియంత్రించే శక్తి మనిషికి మాత్రమే ఉందనే మెసేజ్ ను ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించారు. దర్శకుడు తరుణ్ తేజ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని స్క్రీన్ పై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అశ్విన్స్ మూవీ హారర్ మరియు మైథాలజీ కలిపి తెరకెక్కించిన ఒక డిఫరెంట్ సినిమా. హారర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.





తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నప్పటికీ బేబీ మూవీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యాబై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్‌తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘బేబి’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఫిదా అవుతున్నారు.
ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.
హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్‌ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్‌లో విరాజ్ సన్నివేశాన్ని తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.
కన్నడ సినిమా స్థాయి ఏమిటనేది కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ కేజీఎఫ్ 2 మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టి కన్నడ చిత్రాల వైపు మరలింది. కేజీఎఫ్ చిత్రాలతో పాటుగా కాంతార, విక్రాంత్ రోణ, కిరిక్ పార్టీ, చార్లీ 777, వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచాయి. వాటి ద్వారా కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగింది. అయితే ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు.
చాలా రోజుల తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాతో కన్నడ ప్రేక్షకులు ఊరట పొందారు. జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యువతకి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ కావడంతో యూత్ ఎగబడి సినిమాని చూస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీతో నితిన్ కృష్ణమూర్తి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. హీరో రక్షిత్ శెట్టి, ఒకప్పటి హీరోయిన్ రమ్య, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిలు అతిథి పాత్రలలో నటించారు. ‘కాంతార’ మ్యూజిక్ డైరక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీని తన సంగీతంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఇక ఈ కథ విషయనికి వస్తే, హాస్టల్ లో ఉండే యువకుల మధ్య సాగే కథ ఇది. అయిదుగురు కుర్రాళ్ళు హాస్టల్ లో ఒకే గదిలో ఉంటారు. అయితే అందులో ఒకరికి షార్ట్ ఫిల్మ్ ను తీయాలని అనుకుంటాడు. కానీ వారికి ఎగ్జామ్స్ ఉండటంతో మిగిలిన నలుగురు అందుకు ఒప్పుకోరు. ఆ టైమ్ లోనే హాస్టల్ వార్డెన్ మరణిస్తాడు. కానీ తన చావుకు ఈ అయిదుగురు కుర్రాళ్ళే కారణం అని ఒక లెటర్ రాసిపెట్టి చనిపోతాడు.
ఈ విషయం తెలిసి షాక్ అయ్యి, అందులో నుండి బయటపడడానికి సీనియర్ ను సాయం అడుగుతారు. ఆ తరువాత ఏం జరిగింది? అందులో నుండి అయిదుగురు కుర్రాళ్ళు బయటపడ్డారా? ఆ వార్డెన్ లెటర్ లో వీళ్ళే కారణం అని ఎందుకు రాశాడు? అనేది మిగతా కథ. దర్శకుడు ఈ మూవీ స్క్రీన్ ప్లేను సరదాగా నడిపించారు.





ఈ మూవీలోని ఒక అభ్యంతరకర సన్నివేశంలో సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం చదువుతారు. అదే వివాదానికి దారి తీసింది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని శ్లోకాన్ని అభ్యంతరకర సన్నివేశంలో చదవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాలలో భగవద్గీత ఒకటని చెప్పారు. భగవద్గీతను చదవడం కోసమే ఆయన సంస్కృతం నేర్చుకున్నారని ఒక సందర్భంలో తెలిపారు. న్యూ మెక్సికోలోని ఎడారిలో తొలిసారి 1945లో జులై నెలలో అణుబాంబును పేల్చడానికి 2 రోజుల ముందు ఓపెన్‌హైమర్ భగవద్గీతలోని శ్లోకాన్ని చదివారట.
కొన్నేళ్లకు ముందు శాస్త్రవేత్త ఓపెన్హైమర్కు బర్క్లీలోని ఒక టీచర్ సంస్కృత భాషని పరిచయం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోని భగవద్గీత ఓపెన్హైమర్కు పరిచయమైంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతను వరల్డ్ లోనే అత్యంత దీర్ఘ కవితగా పరిగణిస్తారు. అలాంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఓపెన్‌హైమర్ ప్రపంచ చరిత్రను మార్చే ఒక ఘట్టం మొదలుపెట్టడానికి చదివి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తొలగించుకున్నాడని తెలుస్తోంది.

