సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. అయితే అనివార్య కారణాలతో ఈ మూవీ షూటింగ్ సజావుగా జరగడం లేదు.
అనుకన్న సమయానికి ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుండి షాకింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం తమన్ ను ఈ మూవీ నుండి తప్పించారని ప్రచారం జరిగింది. ఆ తరువాత రిలీజ్ అయిన గ్లింప్స్ తో అవన్నీ రూమర్స్ అని తేలింది. అయితే, తాజాగా తమన్ ను గుంటూరు కారం నుంచి తొలగించారనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ ను తొలగించినట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలుస్తోంది. వైజే రాంబాబు అనే ఎడిటర్ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం. ఈ నెల 24 నుంచి షూటింగ్, జనవరి 13న రిలీజ్. ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్” అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా రెస్పాండ్ అయ్యారు.
మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ట్వీట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ లో మజ్జిగ గ్లాస్ ఇమేజ్ ను షేర్ చేసి, “రేపటి నుండి నా స్టూడియోలో ఫ్రీగా మజ్జిగ స్టాల్స్‌ను మొదలుపెడుతున్నాను. కడుపు మంట లక్షణాలతో ఇబ్బందీపడేవారికి స్వాగతం. నా టైమ్ ని వెస్ట్ చేయకూడదని భావిస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో తమన్ ను తొలగించారనే వార్తలు రూమర్స్ అని తేలింది. హీరోయిన్ పూజా హెగ్డే విషయం తెలియాల్సి ఉంది.
Also Read: చూడడానికి అచ్చం “పూజా హెగ్డే” లాగానే ఉంది కదా..? ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆడియెన్స్ మనసులను హత్తుకుంది. ఈ చిత్రంలో సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించారు. జక్కన్న 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్ గా చాటి చెప్పింది. ఈ సినిమాను చూసి హాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు కూడా జక్కన్న దర్శక ప్రతిభకు మెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ లో కూడా పలు అవార్డులను అందుకుంది
సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అందుకుంది. నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ను ఉరూతలూగించింది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ పనిచేశారు. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారింది.
నాటు నాటు పాటలోని పాపులర్ స్టెప్స్ ని కోలీవుడ్ స్టార్ హీరో మూవీ నుండి కాపీ చేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టార్ హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. విజయ్ 1996లో ‘కోయంబత్తూరు మాపిళ్ళై’ అనే సినిమాలో నటించారు. హీరోయిన్ గా సంఘవి నటించారు. ఇక ఆ సినిమాలో ఒక పాటలో విజయ్ చేసిన స్టెప్స్, జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టెప్స్ ఒకేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మొదలైన విమర్శలు, వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్ రిలీజ్ చేయడంతో గ్రాఫిక్స్ పైన, పాత్రల ఆహార్యం పైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ ఏర్పడింది. హనుమంతుడి కోసం ఒక సీట్ రిజర్వ్ చేయడంతో అందరు భక్తిభావంతో మూవీకి వెళ్లారు.
తీరా మూవీ చూసిన తరువాత మూవీ దర్శకుడిని విమర్శిస్తున్నారు. అసలు రామాయణం మూవీ ఎలా ఉండాలి ? ఎలా తీశారని విమర్శిస్తున్నారు. ఏ క్యారెక్టర్ ను స్పష్టంగా చూపించలేదని, హనుమంతుడి డైలాగ్స్ పై విమర్శిస్తున్నారు. ఈ మూవీలో రాఘవుడు, జానకి, శేషు అని రామాయణ పాత్రల పేర్లు మార్చారని మండిపడుతున్నారు. ఆదిపురుష్ మూవీలోని పాత్రలను హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా తీర్చిదిద్దారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం వివాదస్పదంగా మారింది.
రావణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడుగా నటించిన సైఫ్ అలీఖాన్ పక్షికి మాంసాహారాన్ని తన చేతులతో స్వయంగా తినిపిస్తాడు. రావణుడు ఇలా ఎప్పటికి చేయడు. ఇంత పెద్ద తప్పు ఎలా చేసారు అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాకేష్ మాస్టర్ కు 3పెళ్లిళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మొదటి భార్య గురించి అంతగా తెలియదు. ఇక రెండవ వైఫ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కొడుకు చరణ్ గురించి అందరికి తెలుసు. లాక్ డౌన్ సమయంలో రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తో యూట్యూబ్ వీడియోలు చేశారు. రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులతో జరిగిన గొడవ కారణంగా రెండో భార్య తన నుండి విడిపోయిందని అన్నారు. తన వల్ల వారికి హాని ఉందని, అందుకే చనిపోయినా కూడా రావొద్దని చెప్పిందని ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీ అనే స్త్రీని మూడవ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే లక్ష్మీ తన డబ్బులన్నీ కాజేసి, తన ఫ్యామిలిని మోసం చేసిందని పలు ఇంటర్వ్యూలల్లో రాకేష్ మాస్టర్ ఆరోపించారు. అంతేకాకుండా తనను జైల్లో పెట్టించడానికి కూడా ప్రయత్నించిందని అన్నారు. దాంతో మానసికంగా క్రుంగిపోయిన రాకేష్ మాస్టర్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఉన్న ఒక అనాథశరణాలయంలో చేరారు. ఈ విషయన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలల్లో వెల్లడించారు.
రాకేష్ మాస్టర్ మరణం గురించి గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు మధ్యాహ్నం (ఆదివారం మధ్యాహ్నం) విరోచనాలు, వాంతులు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్‌ను హాస్పటల్ కి తీసుకొచ్చారు. కానీ అప్పటికే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్, డయాబెటిస్ కావడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన గంటకే మాస్టర్ ఆరోగ్యం ఇంకా విషమించింది. రాకేష్ మాస్టర్ ను బతికించేందుకు ప్రయత్నాలు చేసినా, విఫలమవడంతో 5 గంటలకు చనిపోయారని’ అని వెల్లడించారు.
కొంచెం విజ్ఞత, రామాయణం పైన అవగాహన ఉన్న వారందరి నుండి ఆదిపురుష్ మూవీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాని భ్రష్టు పట్టించాయని అంటున్నారు. క్యారెక్టర్ల లక్షణాలు, సందర్భాల ఔచిత్యం గురించి పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ చిత్రాలకు రాసినట్టు డైలాగ్స్ రాశారు అని విమర్శిస్తున్నారు. దాంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
డైలాగ్స్ పై వస్తున్న విమర్శల పై తాజాగా స్పందించిన మనోజ్ ముంతాషిర్ శుక్లా తాను రాసిన డైలాగ్స్ ను సమర్థించుకునేలా ట్వీట్ చేశారు. దాంతో నెటిజెన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ ముంతాషిర్ శుక్లా చేసిన ట్వీట్ లో ‘ఆదిపురుష్ మూవీ కోసం తాను 4000 లైన్ల డైలాగ్స్ రాసానని, అందులో 5 లైన్లు మాత్రం కొందరిని బాధపెట్టాయని, రాముడిని, సీతను కీర్తించిన చాలా డైలాగ్స్ కన్నా ఈ డైలాగ్స్ బాధించినట్టుగా అనిపిస్తోంది. అందుకే నన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.
అయితే మూడు గంటల చిత్రంలో 3 నిమిషాలు ప్రజల ఊహకు భిన్నంగా రాయడంతో తనను సనాతన ద్రోహిగా చూస్తున్నారని మనోజ్ ముంతాషిర్ శుక్లా అన్నారు. నెటిజెన్లు ఈ మాటలు రచయిత మనోజ్ అహంకారాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. డైలాగ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా తప్పులు ఉన్నాయి కదా? మనం ఇంత చెప్తే వీళ్ళకి మాత్రం కేవలం డైలాగ్స్ విషయం మాత్రమే అర్థం అయ్యిందా? అంటున్నారు. ఊహలకు భిన్నంగా కాదు, రామాయణంలోని మౌలిక స్ఫూర్తికి భిన్నంగా, కించపరిచేలా డైలాగ్స్ రాసినందుకు బాధ కలుగుతుందని అంటున్నారు.
అప్పట్లో ఆ అమ్మాయి ఇండస్ట్రీ వారికి చెందిన కూతురని, చిరంజీవి ఫ్యామిలికి దగ్గర వాళ్ల అమ్మాయని అందుకే చిరుతో అంత ఈజ్ గా నటించేసిందని రకరకాల టాక్స్ వచ్చాయి..కానీ నిజానికి ఆ అమ్మాయి నార్త్ ఇండియా ఫ్యామిలికి చెందిన అమ్మాయి..ఊరు ముంబాయి..ప్రస్తుతం యుకెలో ఉంటుంది..డాడీ తర్వాత మరో హింది చిత్రంలో నటించింది..తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు..



































