పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న విడుదలై, మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. సోషల్ మీడియాలో దర్శకుడు, రచయిత పై విపరీతమైన ట్రోలింగ్, ఈ చిత్రం పై వ్యతిరేకత వస్తోంది. ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు విమర్శిస్తూనే ఉన్నారు.
తాజాగా అల్ ఇండియా సినీవర్కర్స్ అసోసియేషన్ ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రముఖ ఆలయ పూజరి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా, మూవీని అందరు తప్పక చూడాలని చెబుతున్నారు. మరి చిలుకూరి బాలాజీ ఆలయ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీ రాముడిగా, సీతగా హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ మూవీలో రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, వేషధారణ పై వివాదాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ప్రశంసలు కురిపించారు.
పూజారి రంగరాజన్ మాట్లాడుతూ, ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి శ్రీ రాముడి గుణాలు గురించి అంతా వెతుకుతున్నారని, ఆదిపురుష్ లో చూపించినట్లుగానే రామాయణం ఉందా? వేరే విధంగా ఉందా అని వెతుకుతున్నారు. ప్రపంచమంతా రాములవారి గురించి మాట్లాడేటట్టు చేసినందుకు ఆదిపురుష్ మూవీ యూనిట్ ను అభినందిస్తున్నాను.
ఇక రావణాసురుడు, శ్రీరాముడు, హనుమంతుడు ఇలా చూపించారని సోషల్ మీడియాలో విమర్శించేవారిని ఉద్దేశించి, ఆదికవి వాల్మీకిలగా రామాయణాన్ని ఎవరు తీయలేరు. వేరే ఎవరు ప్రయత్నం చేసినా దానిలో ఏదో కొదవ ఉంటుందని అన్నారు. దానిని గుర్తించి ఆ ప్రయత్నాన్ని అభినందించాలని, ప్రతీ ఒక్కరు కూడా రాములవారి వైభవాన్ని కీర్తించే ఈ మూవీని తప్పకుండా చూడాలని అన్నారు.
watch video :
Also Read: ఇంతకు మించిన అవమానం లేదు… అందరినీ 50 డిగ్రీల సెల్ఫీయస్ లో తగలబెట్టేయాలి..! ఏం జరిగిందంటే..?

ఆంజనేయుడు దేవుడు కాదని, భక్తుడు మాత్రమే అని ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ ఖన్నా చిత్రయూనిట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ అందరిని కాల్చేయాలని అన్నారు. ముఖేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ‘రామాయణానికి ఆదిపురుష్ ని మించిన అవమానం లేదని, డైరెక్టర్ కు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు.
ఇక రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా అర్థంలేని డైలాగ్స్ ని రాసారని, ఇటువంటి చెత్త డైలాగ్స్ రాసిన వారిని, ఈ మూవీని తీసినవారిని క్షమించకూడదు. రావణుడికి వరం ఎవరు ఇచ్చారో కూడా తెలియదని, హిరణ్యకశ్యపుడి వరాన్ని రావణుడికి చెప్పించారని, రామాయణాన్ని ఇంత అపహాస్యం చేసి, మూవీ యూనిట్ తమను తాము ఇంకా సమర్ధించు కుంటున్నారు.
ఈ మూవీ యూనిట్ మొత్తాన్ని కూడా 50 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలబెట్టి తగలబెట్టాలని అన్నారు. మూవీ పై విమర్శలు వస్తే, మౌనంగా ఉంటారని అనుకున్నాను. అయితే చిత్రయూనిట్ సనాతన ధర్మం కోసమే చేసినట్టు చెబుతున్నారు. వారు రామాయణాన్ని మొత్తం మార్చేశారు అని ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.
ఆది పురుష్ 500 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ, ఈ మూవీ త్రీడిలో తీయడంతో ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తితో ఎదురుచూశారు. హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ పై వివాదం రాగా, మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించింది.
ఆదిపురుష్ వివాదాలు, విమర్శల మధ్య బాక్సాఫీసు దగ్గర కొనసాగుతోంది. మూడు రోజుల్లో 340 కోట్లు వసూల్ చేసిన ఈ మూవీ, నాలుగవ రోజు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు అంటున్నారు. ఈ మూవీ దర్శకుడు ఓంరౌత్ ను, రచయితను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని మరొక విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఈ మూవీలో చూపించిన లంక సీన్ ను హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేసినట్లు గమనించారు. ఆ సినిమా ఏమిటంటే థోర్, ఆ సినిమాలోని అస్గార్డ్ సెట్ ను కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అందులో గోల్డ్ కలర్ లో ఉంటే, ఆదిపురుష్ బ్లాక్ కలర్ లో చూపించారని డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు.




రాకేష్ మాస్టర్ తనకు కెరీర్ ను ఇచ్చిన హీరో గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వెతుకుతున్న టైంలో ఒక హీరో వల్ల కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుందని, ఆయన లేకపోతే తనకు లైఫ్ ఉండేది కాదని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. ఆ హీరో వేణు తొట్టెంపూడి. ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ “నా లైఫ్ లో చాలా కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎందరి దగ్గరికో తిరిగానని, అలాంటి టైంలో వేణు సార్ పిలిచి మరీ నాకు ఛాన్స్ ఇచ్చారు” అని అన్నారు.
వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ మూవీలో “నిన్నలా మొన్నలా లేదురా” అనే సాంగ్ కు కొరియోగ్రఫర్ గా పని చేశానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. చిరునవ్వుతో సినిమానే రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రఫర్ గా తొలి సినిమా. వేణు సార్ వల్లే తన లైఫ్ గొప్పగా మారిందని రాకేష్ మాస్టర్ అన్నారు. కాగా రాకేష్ మాస్టర్ సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏడవ సీజన్ లో భాగంగా సరికొత్త టాస్కులను పోటీదారులకు ఇస్తారని సమాచారం. ఈసారి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి, పాపులర్ అయిన సెలెబ్రెటీలను బిగ్ బాస్ ఏడవ సీజన్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు ఈసారి కొత్త దంపతులతో పాటుగా డైవర్స్ తీసుకున్న సినీ సెలబ్రిటీలను తీసుకువస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఏడవ సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున కాకుండా హీరో రానా దగ్గుబాటి వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ 7 లో పాల్గొనే పోటీదారులు వీళ్లే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..
1. అమర్ దీప్- జానకి కలగనలేదు సీరియల్ నటుడు.
5.హేమచంద్ర – సింగర్.
9. విష్ణు ప్రియ – యాంకర్.
13. ఐశ్వర్య – సీరియల్ హీరోయిన్.
17. పండు – కొరియోగ్రాఫర్
21. పల్లవి ప్రశాంత్- కామన్ మ్యాన్ క్యాటగిరి
రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు అని అంటున్నారు. కానీ ఆయన అసలు పేరు రామిరెడ్డి అని, నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని జమ్మిపాడు ఆయన స్వస్థలమని రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ చిట్టిబాబు తెలిపారు. రాకేష్ మాస్టర్ తండ్రి పేరు బాలిరెడ్డి. ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి . కమ్యూనిస్ట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు బాలిరెడ్డి ఆయనకు అనుచరుడుగా ఉన్నారు. కుల వివక్ష ఉండకూదని సుందరయ్య తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కొరియోగ్రాఫర్లకు రాకేష్ మాస్టర్ గురువు. తర్వాత హైదరాబాద్ కి వచ్చి పలు టెలివిజన్ డాన్స్ షోలలో పాల్గొన్నారు. ఆ తరవాత ఇండస్ట్రీలో అడుగు పెట్టి, దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. రాకేష్ మాస్టర్ మద్యానికి అలవాటుపడి, తాగిన మైకంలో మూర్ఖంగా మాట్లాడేవారని, ఈ ప్రవర్తనే ఆయనను సినీ పరిశ్రమకు దూరం చేసిందని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక రాకేష్ మాస్టర్ పర్సనల్ లైఫ్ విషయనికి వస్తే, ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య విద్యావంతురాలని, ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా చేస్తున్నారని ఆలేటి ఆటమ్ అన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కానీ రాకేష్ మాస్టర్ ప్రవర్తన వల్ల భార్యకు దూరమయ్యారు. ఆ తరవాత రెండవ వివాహం చేసుకున్నారు. ఇటీవల మరో అమ్మాయితో సహజీవనం చేశారు.
సునీల్ లహరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించామని డిస్క్లెయిమర్లో క్లియర్ గా చెప్పారు. రామాయణంలో ఇలాంటి డైలాగ్స్ ఉపయోగించడం సిగ్గు చేటు అని అన్నారు. రావణుడిని పుష్పక విమానంతో చూపించలేదని, లక్ష్మణుడు, మేఘనాథ్ యుద్ధాన్ని నీటిలో చూపించారని’ అన్నారు.
‘ఏ పాత్రకు కూడా క్యారెక్టరైజేషన్ స్పష్టంగా లేదు. డైరెక్టర్ ఈ చిత్రం ఎందుకు తీశాడో, విఎఫ్ఎక్స్తో మూవీని నిలబెట్టలేరు. రామాయణాన్ని సింపుల్‌గా చెప్పాలి. హనుమంతుడితో అలాంటి సంభాషణలు ఎలా చెప్పించారో అర్థం కావట్లేదు’ అని అన్నారు. ఆదిపురుష్ సినిమాలోని క్యారెక్టర్లను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. రావణుడు చాలా అందమైన దేశానికి రాజు. ఈ మూవీలో అలా ఎందుకు చూపించారో, నకిలీ సీతను చూపించాల్సిన అవసరం ఏం వచ్చిందని అన్నారు.
‘మూవీలో స్టోరీని సరళంగా చెప్తే, పరిస్థితి వేరేలా ఉండేది. ఈ మూవీలోని పాత్రలన్ని అయోమయంగా ఉన్నాయని, ఇది నటినటుల మిస్టేక్ కాదు. పాత్రలు స్పష్టంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రం తెరకెక్కించడంలో ఇంకాస్త తెలివిగా వ్యవహరించాల్సింది.’ అని సునీల్ లహరి అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు.
దంగల్, చిచోరే వంటి బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు నితేశ్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తున్నారని ప్రకటించారు. మిగతా పాత్రల కోసం దక్షిణాది నటినటులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ని నితీశ్ తివారి తెరకెక్కించే రామాయణం గురించి అడిగారు. ఓం రౌత్ ఇలా చెప్పుకొచ్చాడు. నితేశ్ తివారి గ్రేట్ డైరెక్టర్. తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. నితీశ్ తివారి తీసిన దంగల్ మూవీ భారతీయ అత్యుత్తమ సినిమాలలో ఒకటి అన్నారు.
నితేశ్ తివారి రచనలు, డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నితేశ్ తీయబోయే రామాయణం పై రామ భక్తుల అందరిలాగే తాను కూడా ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. శ్రీ రాముడి గురించి ఎవరైనా, ఎన్ని చిత్రాలయినా రూపొందించవచ్చు. శ్రీ రాముడి గాధను ఎంత ఎక్కువ మంది చెప్తే అంత మంచిదని అన్నారు.