“ఆదిపురుష్‌” పై మండిపడ్డ ఆనాటి లక్ష్మణుడు..! ఏం అన్నారంటే..?

“ఆదిపురుష్‌” పై మండిపడ్డ ఆనాటి లక్ష్మణుడు..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ  ‘ఆదిపురుష్’. ఈ చిత్రం జూన్ 16న థియేటర్లో రిలీజ్ అయ్యి, మొదటి రోజు నుండే మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డులు సృష్టించింది.

Video Advertisement

మొదటి రోజు రూ.140 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అయితే తీవ్రంగా విమర్శలను ఎదుర్కొంటుంది. ఇక రోజు రోజుకు ఆదిపురుష్ ను విమర్శించే వారు పెరుగుతునే ఉన్నారు. తాజాగా ఈ చిత్రం పై రామాయణం సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
sunil-lahri-on-adipurushసునీల్ లహరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించామని  డిస్‌క్లెయిమర్‌లో క్లియర్ గా చెప్పారు. రామాయణంలో ఇలాంటి డైలాగ్స్ ఉపయోగించడం సిగ్గు చేటు అని అన్నారు. రావణుడిని పుష్పక విమానంతో చూపించలేదని, లక్ష్మణుడు, మేఘనాథ్ యుద్ధాన్ని నీటిలో చూపించారని’ అన్నారు.
‘ఏ పాత్రకు కూడా క్యారెక్టరైజేషన్ స్పష్టంగా లేదు. డైరెక్టర్ ఈ చిత్రం ఎందుకు తీశాడో, విఎఫ్ఎక్స్‌తో మూవీని నిలబెట్టలేరు. రామాయణాన్ని సింపుల్‌గా చెప్పాలి. హనుమంతుడితో అలాంటి సంభాషణలు ఎలా చెప్పించారో అర్థం కావట్లేదు’ అని ‍అన్నారు. ఆదిపురుష్‌ సినిమాలోని  క్యారెక్టర్లను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. రావణుడు చాలా  అందమైన దేశానికి రాజు. ఈ మూవీలో అలా ఎందుకు చూపించారో, నకిలీ సీతను చూపించాల్సిన అవసరం ఏం వచ్చిందని అన్నారు.‘మూవీలో స్టోరీని సరళంగా చెప్తే, పరిస్థితి వేరేలా ఉండేది. ఈ మూవీలోని పాత్రలన్ని అయోమయంగా ఉన్నాయని, ఇది నటినటుల మిస్టేక్ కాదు. పాత్రలు స్పష్టంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రం తెరకెక్కించడంలో ఇంకాస్త తెలివిగా వ్యవహరించాల్సింది.’ అని సునీల్ లహరి అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా,  హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు.

Also Read: “రామాయణం మీద ఎన్ని సినిమాలు అయినా తీయచ్చు..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” డైరెక్టర్ ఓం రౌత్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like