“నేను వెళ్ళిపోతేనే కరెక్ట్..!” అంటూ… కంటతడి పెట్టిస్తున్న పవిత్ర జయరాం భర్త చందు చివరి వాట్సాప్ చాట్..!

“నేను వెళ్ళిపోతేనే కరెక్ట్..!” అంటూ… కంటతడి పెట్టిస్తున్న పవిత్ర జయరాం భర్త చందు చివరి వాట్సాప్ చాట్..!

by Mohana Priya

Ads

త్రినయని సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర జయరాం. గతంలో పవిత్ర కొన్ని సీరియల్స్ లో నటించినా కూడా ఈ సీరియల్ ద్వారా ఇంకా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో తిలోత్తమ అనే పాత్రలో పవిత్ర నటించారు. కొంత కాలం క్రితం పవిత్ర ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దాంతో పవిత్ర భర్త చందు కూడా బాధలోకి వెళ్లిపోయారు. పవిత్ర తమ్ముడిగా చందు త్రినయని సీరియల్ లో నటించారు. చందు రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్కాపురి కాలనీలో ఉండేవారు. చందు అసలు పేరు చంద్రకాంత్. 2015 లో చందు శిల్ప అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Video Advertisement

pavitra-jayaram husband emotional post

వాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తర్వాత చందు, పవిత్ర పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ ని ఇటీవల పవిత్ర సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చందు పవిత్ర చనిపోయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాము భార్యాభర్తలం అని చెప్పారు. ఈ విషయాన్ని వారి స్వయంగా మీడియా ముందుకి వచ్చి ప్రకటించాలి అనుకున్నారు అని, కానీ అంతలోపే ఇలా జరిగింది అని చెప్పారు. అయితే గతవారం చందు వాట్సాప్ లో మాట్లాడిన చాట్ ఒకటి బయటికి వచ్చింది. అందులో చందు కి ఒకరు బాధపడకు అని అర్థం వచ్చేలాగా మెసేజ్ పెట్టారు. అందుకు చందు, “నో. నేను వెళ్ళిపోతాను” అని రిప్లై ఇచ్చారు. అందుకు ఆ వ్యక్తి, “ఎక్కడికి” అని అడిగారు.

అప్పుడు చందు, “ఇంక చాలు ఈ జన్మ. బట్ ఎవరికి చెప్పకండి” అని రిప్లై ఇచ్చారు. అందుకు అవతల మాట్లాడుతున్న వ్యక్తి, “వద్దు అలా మాట్లాడకు చందు. మనం కలిసి పని చేశాం. నువ్వు నాకు బాగా తెలుసు. నేను అందుకే నిన్ను పలకరిస్తున్నా పదే పదే” అని రిప్లై ఇచ్చారు. అందుకు చందు, “నేను వెళ్ళిపోతేనే కరెక్ట్. లేదా నేను పిచ్చోడిని అయిపోయి లేదా తాగుబోతు అయిపోయి ఇంట్లో వాళ్లని ఇబ్బంది పెట్టను” అని రిప్లై ఇచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి, “వద్దు. మేం అంతా లేమా. వద్దు. అలా ఇంకొకసారి మాట్లాడకు” అని రిప్లై ఇచ్చారు. అందుకు చందు ఏమోజీలతో రిప్లై ఇచ్చారు. ఈ చాట్ చేసిన వ్యక్తి చందు తో కలిసి పని చేసిన వ్యక్తి అని తెలుస్తోంది. చందు పట్ల ప్రముఖులు, ఈ వార్త విన్న ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like