“రాకేష్ మాస్టర్” తండ్రి ఎంత గొప్పవారో తెలుసా..? అప్పట్లోనే ఇంత ఆలోచించారా..?

“రాకేష్ మాస్టర్” తండ్రి ఎంత గొప్పవారో తెలుసా..? అప్పట్లోనే ఇంత ఆలోచించారా..?

by kavitha

Ads

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం నాడు గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అనేక హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు. కొరియోగ్రాఫర్ గా వినూత్నమైన డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

Video Advertisement

ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్న శేఖర్, జానీ మాస్టర్లు రాకేష్ మాస్టర్ శిష్యులే. హీరో వేణు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లకు రాకేష్ మాస్టర్ డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. అయితే రాకేష్ మాస్టర్ తండ్రి, ఆయన భార్య గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి రాకేష్ మాస్టర్ తండ్రి ఎవరో? ఆయన భార్య ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.. rakesh-master-biographyరాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు అని అంటున్నారు. కానీ ఆయన అసలు పేరు రామిరెడ్డి అని, నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని జమ్మిపాడు ఆయన స్వస్థలమని రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ చిట్టిబాబు తెలిపారు. రాకేష్ మాస్టర్ తండ్రి పేరు బాలిరెడ్డి. ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి . కమ్యూనిస్ట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు బాలిరెడ్డి ఆయనకు అనుచరుడుగా ఉన్నారు. కుల వివక్ష ఉండకూదని సుందరయ్య తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారు.దాంతో బాలిరెడ్డి తన పేరులోని రెడ్డిని, తన కుమారుడు రాకేష్ మాస్టర్ పేరులోని రెడ్డిని కూడా  తొలగించారట. అలా రామిరెడ్డి రామారావుగా మారింది. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ గా మారింది. రాకేష్ మాస్టర్ స్వస్థలం చాలామంది తిరుపతి అనుకుంటున్నారు. బాలిరెడ్డికి తిరుపతి మార్కెట్ యార్డులో జాబ్ రావడంతో ఫ్యామిలీతో నెల్లూరు నుండి తిరుపతికి వెళ్లారు. రాకేష్ మాస్టర్ అక్కడే డాన్స్ స్కూల్ ను మొదలుపెట్టారు. సినిమాలలో ఛాన్స్ కోసం మద్రాసు వెళ్లారు. అక్కడ చాలా మంది డాన్స్ మాస్టర్ల వద్ద అసిస్టెంట్ గా చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కొరియోగ్రాఫర్లకు రాకేష్ మాస్టర్ గురువు. తర్వాత హైదరాబాద్ కి వచ్చి పలు టెలివిజన్ డాన్స్ షోలలో పాల్గొన్నారు. ఆ తరవాత ఇండస్ట్రీలో అడుగు పెట్టి, దాదాపు 1500 చిత్రాలకు  కొరియోగ్రాఫర్‌గా చేశారు. రాకేష్ మాస్టర్ మద్యానికి అలవాటుపడి, తాగిన మైకంలో మూర్ఖంగా మాట్లాడేవారని, ఈ ప్రవర్తనే ఆయనను సినీ పరిశ్రమకు దూరం చేసిందని సన్నిహితులు చెబుతున్నారు.
rakesh-master ఇక రాకేష్ మాస్టర్ పర్సనల్ లైఫ్ విషయనికి వస్తే, ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య విద్యావంతురాలని, ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా చేస్తున్నారని ఆలేటి ఆటమ్ అన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కానీ రాకేష్ మాస్టర్ ప్రవర్తన వల్ల భార్యకు దూరమయ్యారు. ఆ తరవాత రెండవ వివాహం చేసుకున్నారు. ఇటీవల మరో అమ్మాయితో సహజీవనం చేశారు.

Also Read: “ఆదిపురుష్‌” పై మండిపడ్డ ఆనాటి లక్ష్మణుడు..! ఏం అన్నారంటే..?

 

 

 

 


End of Article

You may also like