ఒక సినిమా ఇంత ఎమోషనల్ చేస్తుందా..? ఈ సినిమా చూశారా..?

ఒక సినిమా ఇంత ఎమోషనల్ చేస్తుందా..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

సింపుల్ పాయింట్ ఎంచుకుని దానిని చాలా సహజంగా తెరకెక్కించి, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం  మలయాళ చిత్రాల ప్రత్యేకత అని చెప్పవచ్చు. అటువంటి చిత్రాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో మంచి ఆదరణ దక్కుతోంది.

Video Advertisement

తాజాగా అలాంటి కంటెంట్ తో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆ చిత్రం పేరు  ‘నెయిమర్’. ఈ మూవీ గత సంవత్సరం మే 12న థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది.  ఈ చిత్రం ఆగస్ట్ 8 నుండి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ అందుబాటులోకి వచ్చింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్  కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్‌బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు. కుంజవ, సింటో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు. అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు. దాని పేరే ‘నెయిమర్’. అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు. ఆ తరువాత నెయిమర్ అనే  కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది. అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది.సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు. వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది. క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు. ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి. కంటతడి పెట్టిస్తాయి.

Also Read: ఇంత గొప్ప ఎలివేషన్ ఇచ్చారు అనుకున్నాం..! కానీ ఇది ఒరిజినల్ కాదా..?


End of Article

You may also like