ఎనిమిది సంవత్సరాల తర్వాత మాజీ ప్రియురాలు కనిపిస్తే..? ఈ సినిమా చూశారా..?

ఎనిమిది సంవత్సరాల తర్వాత మాజీ ప్రియురాలు కనిపిస్తే..? ఈ సినిమా చూశారా..?

by Mohana Priya

Ads

ఎన్ని రకాల సినిమాలు వచ్చినా కూడా లవ్ స్టోరీస్ అంటే ఇప్పటికి కూడా అందరికీ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చిన లవ్ స్టోరీ సినిమాలు అయినా సరే ఇప్పుడు చూస్తే అవి బోర్ కొట్టవు. లవ్ స్టోరీస్ కి సాధారణంగా అంత మంది అభిమానులు ఉంటారు. అలా గత సంవత్సరం వచ్చిన ఒక సినిమా చాలా మంచి రివ్యూస్ పొందింది. ఈ సినిమా పేరు తీర కాదల్. హీరో జై, ఐశ్వర్య రాజేష్, శివదా ముఖ్య పాత్రలు పోషించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, గౌతమ్ (జై), అతని భార్య వందన (శివదా), కూతురు ఆర్తి (వృద్ధి విశాల్) లతో ఆనందంగా ఉంటాడు.

Video Advertisement

love story that received appreciation

ఒకసారి గౌతమ్ కి అతను ప్రేమించిన అరణ్య (ఐశ్వర్య రాజేష్) కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎనిమిది సంవత్సరాల తర్వాత కలుస్తారు. అరణ్యని తన భర్త ఇబ్బంది పెడుతున్నాడు అని, అందుకే ఇంట్లో నుంచి వచ్చేసాను అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. మాజీ ప్రేమికులు కలవడం అనే కాన్సెప్ట్ ని చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఒకసారి ఎవరి జీవితాల్లో వాళ్ళు ముందుకు వెళ్లిపోయిన తర్వాత కలిసినప్పుడు వాళ్లు ముందు లాగానే ఉంటారా? లేదా ఇప్పుడు అన్ని మారిపోతాయా? ఇవన్నీ చాలా తక్కువ సినిమాల్లో వివరంగా చూపిస్తారు.

love story that received appreciation

ఈ సినిమాలో ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. రోహిణి వెంకటేశన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సినిమా చాలా సున్నితమైన అంశం మీద నడుస్తుంది. ఇలాంటి అంశాన్ని చూపించాలి అంటే నటీనటులు అంత బాగా పెర్ఫార్మ్ చేయడం కూడా ముఖ్యం. ఈ సినిమాలో వాళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తమిళ్ భాషలో ఈ సినిమా రూపొందినా కూడా, తెలుగు భాషలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : రామ్ చరణ్ “ఆరెంజ్” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇలా అయిపోయిందేంటి..?


End of Article

You may also like