సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతులు పొందిన కృష్ణంరాజు మరణించారు. కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరాదేవి కూడా కన్నుమూశారు.
ఘట్టమనేని కుటుంబం విషయానికి వస్తే ఇందిరా దేవి ఇప్పుడు మరణించారు. దానికి ముందు కృష్ణ రెండవ భార్య విజయనిర్మల కూడా మృతి చెందారు. అలానే చిన్న వయసులోనే రమేష్ బాబు కూడా మరణించారు. ఇలా ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

దీనితో ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలని, ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకోగా.. 1969లో విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. అయితే కృష్ణ కి మొత్తం ఐదుగురు పిల్లలు. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శని. ఇదిలా ఉంటే ఘట్టమనేని కుటుంబంలో చనిపోయిన ఈ ముగ్గురు కూడా అనారోగ్య సమస్యతో బాధపడే చనిపోయారు. 2019 లో కృష్ణ రెండవ భార్య విజయనిర్మల చనిపోయారు. గుండెపోటుతో ఆమె చనిపోవడం జరిగింది. అలానే కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు కూడా మృతి చెందారు.

మొదటి భార్య ఇందిరాదేవి కూడా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. ఇలా వరుసగా మరణాలు వస్తుండడంతో కృష్ణ క్రుంగిపోయారు. ఇలా వరుస మరణాలు చూసి ఫ్యాన్స్ కూడా భయ పడుతున్నారు. చనిపోయిన ముగ్గురు కూడా అనారోగ్య సమస్యలతో చనిపోయారని ముఖ్యంగా రమేష్ బాబు చిన్న వయసులోనే చనిపోయారని బాధ పడుతున్నారు.

విజయనిర్మల, ఇందిరాదేవి కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ చనిపోయారు. రమేష్ బాబు కూడా అనారోగ్యం వలన చనిపోయారు అయితే సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారు అందుకని అభిమానులు కృష్ణ ఆరోగ్య పరిస్థితి కూడా ఇదే విధంగా మారుతుంది ఏమో అని ఫ్యాన్స్ చర్చించుకుని బాధపడుతున్నారు.





ఇదిలా ఉండగా గతం లో మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టెయిట్ర్ లో ఆయన్ను విష్ చేసింది నికిషా. అయితే ఆ ట్వీట్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో తారక్ నటనకు ఫిదా ఇపోయా అన్నట్లు పోస్ట్ పెట్టింది. అలాగే తాజాగా అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూసా.. నాకు నచ్చలేదు అని కామెంట్లు చేయడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే గతం లో ఆమె ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చూడకుండానే ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారా అంటూ రెండు ట్వీట్ల స్క్రీన్ షాట్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు జనాలు.


























































































