“ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. తొలి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన రాశి ఖన్నా ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆకట్టుకునే అందం అందుకుతగ్గ నటన కలిసి ఉన్న హీరోయిన్ రాశిఖన్నా వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు..
కోవిడ్ ముందు వరకు రాశి ఖన్నా ఫామ్ లోనే ఉన్నారు. కరోనా కారణంగా సినిమా విడుదలలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కోవిడ్ కు ముందు 2019 లో రాశి ఖన్నావి రెండు సినిమాలు విడుదల అయ్యాయి.
తెలుగుతో పాటు, తమిళ్, మలయాళ చిత్రాలలో కూడా రాశి తన ప్రయత్నాలను చేసింది. అయితే.. ఎక్కడ అంత బ్రేక్ రాలేదు. ఇలా ఉండగానే ఈ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఓ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దు గుమ్మ. రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యింది.
“రుద్ర” అనే సిరీస్ లో రాశి ఖన్నా నటించింది. ఈ సిరీస్ లో అజయ్ దేవగన్ హీరో గా నటించారు. ఇటీవలే విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నేషనల్ మీడియా ఆమెతో ఇంటరాక్ట్ ఐయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాశి ఖన్నా సౌత్ ఇండస్ట్రీ లో కెరీర్ ఆరంభంలో వారు తనను గ్యాస్ ట్యాంకర్ అని వెక్కిరించారని చెప్పుకొచ్చింది. సౌత్ కి వెళ్ళాక ఓ రొటీన్ ఫార్ములా కి అలవాటు పడ్డానని.. అక్కడ అలా మార్చేశారని చెప్పుకొచ్చింది.
కమర్షియల్ సినిమాలలో కొద్దీ సేపు హీరో పక్కన కనిపించడం, తర్వాత వెళ్లిపోవడం లాంటి ఫార్ములా నే అలవాటు అయ్యిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్లను టాలెంట్ తో సంబంధం లేకుండా లుక్స్ ని బట్టే చూస్తారని, తెల్ల తోలు ఉంటె చాలు.. మిల్కీ బ్యూటీ అనేస్తారు.. కానీ అంతకుమించిన టాలెంట్ వారిలో ఉంటుందని గుర్తించాలి అని చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్స్ పై సౌత్ ఆడియన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. సౌత్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తరువాత సౌత్ సినిమాలపైనే ఆడిపోసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడుతున్నారు.































#
#
#
#
# 





















