బుల్లితెర హీరోయిన్ సోనారిక బడోరియా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, మహా దేవ్ సీరియల్ లో పార్వతి దేవి అనగానే అందరు ఆమెని గుర్తు పట్టేస్తారు. మహా దేవ్ సీరియల్ తో బాలీవుడ్ లోనే కాకుండా సోనారిక బడోరియా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఈ సీరియల్ లో ఆమె శివుడి పక్కన పార్వతిగా కనిపించారు.
నిజంగా శివ పార్వతులని చూస్తున్నట్లే ఉంటుంది ఈ సీరియల్ చూస్తుంటే. అందుకే ఈ సీరియల్ అంత పాపులర్ అయ్యింది. తాజాగా.. ఈ నటి తనకు ఎదురైన చేదు సంఘటనని పంచుకుంది.
2018 లో సోనారిక ఓ సీరియల్ లో నటించారు. “సలీం అనార్కలీ..” పేరుతో ఈ సీరియల్ ను ఏడాది పాటు ప్రసారం చేసారు. ఈ సీరియల్ కూడా సోనారికకు మంచి పేరే తెచ్చి పెట్టింది. కానీ, ఈ సీరియల్ లో నటించినందుకు గాను సోనారికకు ఇప్పటివరకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. ఈ సీరియల్ కోసం సీరియల్ నిర్మాతలు సోనారికకు రూ.70 లక్షల డబ్బును ఇవ్వాల్సి ఉందట.
ఈ సీరియల్ అయిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటివరకు తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని సదరు నటి వాపోతోంది. కేవలం తనకే కాదు, ఆ సీరియల్ కోసం పనిచేసిన టెక్నిషన్స్ కి, ఇతర నటీనటులకు కూడా ఇప్పటివరకు పేమెంట్స్ ఇవ్వలేదట. కరోనా ఫస్ట్ వేవ్ లో చాలా ఇబ్బంది పడ్డామని.. రావాల్సిన డబ్బులు రాకుంటే ఇబ్బందులతో సతమతమవ్వుతున్నామని.. ఈ విషయమై చట్టపరంగా కూడా ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. త్వరలోనే.. తనకు రావాల్సిన డబ్బు అందుతుందని భావిస్తున్నానని పేర్కొంది.