చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.
సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ట్రైలర్ విడుదల అయిన తర్వాత రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. కొంతమంది బాగుంది అంటే మరికొంతమంది మాత్రం ఒరిజినల్ సినిమాకి సంబంధం లేదు అని అన్నారు. కానీ ఈ సినిమా దాదాపు ఒరిజినల్ సినిమాలాగానే ఉంటుంది. స్టొరీ లైన్ పెద్దగా మార్చలేదు. కానీ పవన్ కళ్యాణ్ పాత్రకి తగ్గట్టు కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది.
మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా లో ట్రైలర్ లో చూపించిన రెండు సీన్లను మొత్తానికే లేపేశారు. అందులో పవన్ కళ్యాణ్ రానా కి లిఫ్ట్ ఇచ్చే సీన్ ఒకటి కూడా ఉంది. నిజానికి ఈ సీన్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ, సినిమాలో ఈ సీన్ ని తీసేసారు. అలాగే.. అంత ఇష్టం సాంగ్ కి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఒకరకంగా ఈ సాంగ్ కూడా సినిమాకి హైప్ తీసుకొచ్చింది. కానీ ఈ సాంగ్ ని కూడా సినిమాలో లేపేశారు. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్లే ఈ సాంగ్ ని, ఆ లిఫ్ట్ ఇచ్చే సీన్ ని లేపేశారు అని తెలుస్తోంది.