ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
ఈ సినిమా నిన్న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కొంత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం తన పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.
దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ గానే అంచనాలు నెలకొన్నాయి. అయితే పుష్ప రిలీజ్ రోజు అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ తన తండ్రి కోసం ఓ గ్రీటింగ్ కార్డు ని తయారు చేసాడు. అల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ ఆ గ్రీటింగ్ పైన రాసాడు. పుష్ప డ్రాయింగ్ ను తనకు తోచినట్లు వేసాడు. దీనిని బన్నీ తన ఇన్స్టా లో పంచుకున్నారు.
View this post on Instagram