దర్శకధీరుడు రాజమౌళి గురించి, నటసింహం బాలయ్య బాబు గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి తాను తీసే సినిమాల కథ విషయంలో ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటాడు.
అందులో పాత్రకి నటుల్ని కూడా పక్కాగానే ఎంచుకుంటాడు. అలా.. ఓ సినిమాకి బాలయ్య బాబు అయితే బాగుంటుందని అనుకున్నారు. రాజమౌళి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.
తిరిగి ఎన్టీఆర్ తోనే “సింహాద్రి” సినిమా తీసి స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. వాస్తవానికి.. ఈ సినిమా స్టోరీ ని రాజమౌళి ముందు బాలయ్య కి చెప్పారట. కానీ., బాలయ్యకి ఈ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట. ఆ తరువాత ఈ స్టోరీకి ఎన్టీఆర్ ఒకే చెప్పడంతో సింహాద్రి మూవీ స్టార్ట్ అయింది. ఈ సినిమాకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ వచ్చిందో తెలిసిందే. అప్పట్లోనే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.