Filmy Adda
“సూర్య ” వెబ్ సిరీస్ లో ఎట్టకేలకు సూర్య కి జాబ్ రావడం పై ట్రెండ్ అవుతున్న టాప్ 30 ట్రోల్స్..!
లాక్ డౌన్ వచ్చిన తరువాత థియేటర్లకు వెళ్లడం తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్ లలో వెబ్ సిరీస్ లకు యువత బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రమం లో వెబ్ సిరీస్ లు కూడా సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధం గా రూపొందుతున్నాయి. కొత్త కథలతో, కాన్సెప్ట్స్ తో ఆకట్టుకునే విధం గా యువ దర్శకులు వీటిని రూపొందిస్తున్నారు. అలా.. యువత కు బాగా చేరువైన వెబ్ సిరీస్ లలో “సూర్య” వెబ్ సిరీస్ ఒకటి.

ఇంజనీరింగ్ పూర్తి అయ్యి.. జాబ్ కోసం పాట్లు పడుతున్న ఒక మధ్య తరగతి యువకుడి కథ ఇది. ఈ కాన్సెప్ట్ చాలా మంది యువతకి కనెక్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాబ్ దొరకడం చాలా కష్టం గా ఉంది. ఫ్రెషర్ గా ఉండి, ప్లేసెమెంట్స్ లో జాబ్ కొడితే తప్ప.. బయట జాబ్ వెతుక్కోవడం అంత ఈజీ గా అయ్యేపని కాదు.

ఈ క్రమం లో యువతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న విషయాలను చెబుతూ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఐతే.. ఈ వెబ్ సిరీస్ చివరకు వచ్చే వరకు సూర్య కి జాబ్ రాదు. లాస్ట్ ఎపిసోడ్ లో ఎట్టకేలకు సూర్య జాబ్ కొడతాడు. దీనితో ఈ వెబ్ సిరీస్ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. సూర్య కి జాబ్ రావడం పై ట్రెండ్ అవుతున్న టాప్ 30 ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.

#2.
#3.
#4.
#5.
#6. 
#7. 
#8. 
#9. 
#10. 
#11.
#12. 
#13. 
#14. 
#15.
#16. 
#17. 
#18. 
#19. 
#20.
#21. 
#22. 
#23. 
#24. 
#25. 
#26. 
#27. 
#28. 
#29.
#30.
ఏంటి! చిరంజీవి హాలీవుడ్ సినిమాలో నటించారా.? ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే.?
ఒక సంవత్సరంలో మన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ చేస్తారు. అయితే, అలా అనౌన్స్ చేసిన సినిమాలు అన్నీ టైంకి పూర్తి అవ్వాలని రూలేమి లేదు. అలా మొదలు పెట్టిన ఎన్నో సినిమాలు తర్వాత ఆగిపోయాయి. వాటిలో పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అందుకు కారణం ఏదైనా అవ్వొచ్చు. అలా మొదలయ్యి ఆగిపోయిన సినిమాల్లో ఒకటి చిరంజీవి హీరోగా నటించిన అబు.

ఇది హాలీవుడ్ సినిమా. ఈ సినిమాకి ఇంగ్లీషులో ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టారు. తెలుగులో అయితే అబూ బాగ్దాద్ గజదొంగ అనే పేరు పెట్టారు. ఈ సినిమా 1999 లో మొదలయ్యింది. ఈ సినిమా నిర్మాతలు నీల్ ఆడమ్స్, రమేష్ కే సుందర్ స్వామి. దర్శకులు ఇంగ్లీష్ వర్షన్ కి డోచెన్ గెర్సీ, తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ గారు.

ఈ సినిమాలో మనిషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా, రెహమాన్ సంగీతం అందించారు. సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అందుకు రెండు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఖురాన్ ని అభ్యంతరకరంగా చూపించారట. ఒక సన్నివేశంలో ఖురాన్ ని పురాతనంగా చూపించడానికి బురదలో నుంచి తీస్తారట.

దాని వల్ల సినిమా వివాదాల్లో ఇరుక్కుంది. సౌదీ అరేబియాలో కేస్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే మన పురాణాల ప్రకారం సూర్య దేవుడు ఐదు గుర్రాల మీద స్వారీ చేస్తారు. ఈ సినిమాలో అందుకు విరుద్ధంగా ఉందట. ఇంకొక కారణం ఏంటంటే సినిమాకి బడ్జెట్ సరిపోకపోవడంతో ఆపేశారు అనే ఒక వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ కారణాల్లో ఏది నిజమో ఆ సినిమా బృందానికి మాత్రమే తెలియాలి. ఈ సినిమా విడుదలయ్యి ఉంటే చిరంజీవి ఆ టైంలోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయేవారు కదా.
పెళ్లి పీటల వరకు వచ్చి నిలిచిపోయిన 8 మంది సెలెబ్రిటీల పెళ్లిళ్లు…!
ప్రేమ అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే ఎవరి నుండి సరైన సమాధానం రాదు. ఎందుకంటే అసలు డెఫినేషన్ ఏంటో ఎవరికీ తెలియదు కాబట్టి. అందరి ప్రేమకథలు పెళ్లి వరకు వెళ్లకపోవచ్చు.ఎక్కడో కొంతమంది మాత్రమే వాళ్లు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోగలుగుతారు అని అంటారు.

ఇది నిజంగా ఒక వ్యక్తికి సంబంధించిన చాలా పర్సనల్ విషయం కాబట్టి వాళ్లు తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాల గురించి ఎక్కువగా చర్చించుకోలేము.మన సెలబ్రిటీలలో కూడా కొంతమంది రిలేషన్ షిప్స్ దాదాపు పెళ్లి వరకు వెళ్ళాయి.
మామూలుగా సెలబ్రిటీల మధ్య రిలేషన్ షిప్ రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ కొంతమంది తాము పెళ్లి చేసుకుంటున్నాం అని ఎనౌన్స్ చేసిన తర్వాత, లేదా పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్త వచ్చిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అలా ఇష్టపడిన వాళ్లని పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ సెలబ్రిటీలు ఎవరంటే.
#1 అక్షయ్ కుమార్ – శిల్పా శెట్టి

#2 త్రిష – వరుణ్ మణియన్

#3 ప్రభుదేవా – నయనతార

#4 ఉదయ్ కిరణ్ – సుష్మిత

#5 విశాల్ – అనీషా

#6 అఖిల్ – శ్రేయ భూపాల్

#7 రక్షిత్ శెట్టి – రష్మిక మందన్న

#8 మెహ్రీన్ పిర్జాదా – భవ్య బిష్ణోయ్
కొద్ది రోజుల క్రితం మెహ్రీన్ తన పెళ్లి కాన్సిల్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీని వెనకాల కారణం ఏంటో ఎవరికీ తెలియదు.

వీళ్లే కాకుండా రణ్ బీర్ కపూర్ – దీపికా పదుకొనే, శింబు – హన్సిక, ఇలియానా – ఆండ్రూ నీబోన్, శృతిహాసన్ – మైకేల్ కోర్స్ లే పెళ్లి వరకు కాకపోయినా కూడా వాళ్ల ప్రేమని బహిరంగంగా ప్రకటించారు.
కొంతమంది తాము డైరెక్ట్ గా ప్రేమలో ఉన్నామని చెప్పకపోయినా కూడా ఇన్ డైరెక్ట్ గా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా కానీ లేదా వాళ్లు మాట్లాడిన మాటల ద్వారా కానీ వాళ్ల రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసింది. కానీ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లు విడిపోయారు.
సినిమాల్లో మనకి కనిపించని 10 అపరిచిత క్యారెక్టర్లు…మిస్టరీగా మిగిలిపోయారు.!
సినిమాలో మెన్షన్ చేసే ప్రతి పాత్ర కనిపించాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో కొన్ని పాత్రల పేర్లు మెన్షన్ చేస్తారు అలాగే వాళ్ళ గొంతులు వినిపిస్తాయి కానీ వాళ్లు మాత్రం కనిపించరు. అలా అలా మన సినిమాల్లో వాళ్ల గురించి ప్రస్తావించినా కానీ తెరపై కనిపించకుండా ఉన్న పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 సువర్ణ – జాతి రత్నాలు
రాహుల్ రామకృష్ణ పాత్ర సువర్ణ తో సినిమా మొత్తం మాట్లాడతాడు. కానీ సువర్ణ ఎవరో మనకి చూపించరు.

#2 బల్లాల దేవ భార్య – బాహుబలి
బాహుబలి సినిమాలో బల్లాల దేవ భార్య, అడవి శేష్ తల్లి ఎవరో మనకి చూపించరు.

#3 సురేఖ వాణి భర్త – బొమ్మరిల్లు
బొమ్మరిల్లు సినిమాలో సురేఖ వాణి పాత్ర ఫోన్ లో తన భర్తతో మాట్లాడుతూ ఉంటారు. కానీ తన భర్త ఎవరో మనకి ఒకసారి కూడా సినిమాలో చూపించరు.

#4 జాను భర్త – జాను
జాను సినిమాలో తన భర్త పాత్ర పేరు చెప్తుంది కానీ ఆయన ఎవరో మనకి చూపించరు.

#5 ఐదు పాత్రలు – గ్యాంగ్ లీడర్
గ్యాంగ్ లీడర్ సినిమా మొత్తం ఒక 5 పాత్రలకు సంబంధించిన ఐదుగురు మహిళలు చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రల గురించి మనకు చెబుతారు. కానీ వాళ్ళు ఎవరో మనకు సరిగ్గా చూపించరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనిపిస్తారు. కానీ వాళ్ల మొహాలు క్లియర్ గా కనిపించవు.

#6 స్వర్ణ పుష్పం – రఘువరన్ బీటెక్
రఘువరన్ బీటెక్ సినిమాలో వివేక్ గారు తన భార్య స్వర్ణ పుష్పం తో మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ గొంతు మనకు వినిపిస్తుంది కానీ ఆవిడ ఎవరో మనకు చూపించలేదు.

#7 సునీల్ వాళ్ళ అన్నయ్య – మన్మధుడు
సోనాలి బింద్రే చేసుకోబోయే అతని తమ్ముడు అయిన సునీల్ పాత్ర మనకు చూపించారు. కానీ అసలు సునీల్ అన్న పాత్ర ఎవరో మనకి చూపించలేదు.

#8 అరుంధతి భర్త – అరుంధతి
అరుంధతి సినిమాలో అనుష్క కి పెళ్లి అయినట్లు చూపిస్తారు కానీ తన భర్త ఎవరో మనకు చూపించలేదు.

#9. నివేదా థామస్ బాయ్ ఫ్రెండ్ – వకీల్ సాబ్

#10. నాగార్జున తల్లి – నువ్వొస్తావనీ

“నువ్వొస్తావనీ” సినిమాలో నాగార్జునకు తల్లి ఉంటుంది. మనీ ఆర్డర్ పంపిస్తూ ఉంటుంది. తన తల్లి కళ్ళనే హీరోయిన్ కి కూడా పెడతారు. కానీ ఆ తల్లి ఎవరు అనేది సినిమాలో ఎక్కడ చూపించలేదు.
కేవలం వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల గురించి చెప్తారు. కొన్ని సినిమాల్లో అయితే వాళ్ళ గొంతు కూడా వినిపిస్తాయి. కానీ వాళ్ళు ఎవరో మనకి చూపించలేదు.
టాలీవుడ్ నుండి రీమేక్ అయ్యి నిరాశపరిచిన 10 పాటలు.! లిస్ట్ ఒక లుక్కేయండి.!
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు.

అయితే కేవలం సినిమాలకు మాత్రమే కాదు పాటలకి కూడా వర్తిస్తుంది. వేరే భాషలో హిట్ అయినా, లేకపోతే బాగున్న పాటలని తెలుగులో రీమేక్ చేశారు. అలాగే మన తెలుగులో సూపర్ హిట్ అయిన పాటలు అన్ని వేరే భాషల్లో కూడా రీమేక్ చేశారు కొన్ని పాటలు ఒరిజినల్ కి న్యాయం చేసేలా ఉంటే కొన్ని పాటలు మాత్రం అసలు రీమేక్ ఎందుకు చేశారు అనిపించేలా గా ఉంటాయి ఒరిజినల్ పాట ఇచ్చినంత మంచి ఫలితాన్ని ఇవ్వవు. అలా మన భాషలో నుండి రీమేక్ అయ్యే ఆశించిన ఫలితాన్ని ఇవ్వని పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 మిరపకాయ్ – ఇష్టం
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#2 ఆర్య 2 – రెడీ – ఫైవ్ ఇడియట్స్
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
రీమేక్ వెర్షన్ (కన్నడ)
#3 పౌర్ణమి – ఫైవ్ ఇడియట్స్
ఒరిజినల్ వెర్షన్
https://www.youtube.com/watch?v=lWLxwjWhEzQ
రీమేక్ వెర్షన్
#4 రచ్చ – ఫుల్ అండ్ ఫైనల్
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#5 ఆర్య – మాక్సిమమ్
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#6 ఆర్య 2 – అజోబ్ ప్రేమ్
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#7 రామయ్య వస్తావయ్య – గుండా ద టెర్రరిస్ట్
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#8 కిక్ – ఇష్టం
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#9 దువ్వాడ జగన్నాథం – రాధే
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
#10 ఒక్కడు – సింగం పులి
ఒరిజినల్ వెర్షన్
రీమేక్ వెర్షన్
దర్శకులతో ప్రేమలో పడి…పెళ్లి చేసుకున్న 8 మంది హీరోయిన్లు.! లిస్ట్ ఓ లుక్ వేయండి.!
సాధారణంగా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంత మంది హీరోయిన్లు, డైరెక్టర్లని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అలా డైరెక్టర్లని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 సుహాసిని – మణిరత్నం
సుహాసిని గారు, దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

#2 ఖుష్బూ – సుందర్
నటి ఖుష్బూ, కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

#3 రోజా – సెల్వమణి
అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలని కూడా సమానంగా బాలన్స్ చేస్తూ, ఇప్పటికీ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, టీవీ షోస్ ద్వారా మనల్ని అలరిస్తున్న రోజా కూడా దర్శకులు సెల్వమణి గారిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

#4 శోభ – బాలు మహేంద్ర
భారతదేశంలో గొప్ప దర్శకులలో ఒకరైన బాలు మహేంద్ర గారు, నటి శోభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1980 లో శోభ గారు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత బాలు మహేంద్ర గారు 1998 లో మౌనిక అనే నటిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ వారి పెళ్లి గురించి 2004 లో ఎనౌన్స్ చేశారు. బాలు మహేంద్ర గారు మొదట అఖిలేశ్వరి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ నటి కాదు.

#5 శరణ్య – పొన్వన్నన్
నటి శరణ్య గారు, నటులు, దర్శకులు పొన్వన్నన్ గారిని పెళ్లి చేసుకున్నారు.

#6 దేవయాని – రాజకుమారన్
నటి దేవయాని గారు కూడా, రాజకుమారన్ అనే దర్శకుడి ని పెళ్లి చేసుకున్నారు. దేవయాని తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ 2001 లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

#7 రమ్య కృష్ణ – కృష్ణ వంశీ
రమ్య కృష్ణ గారు, స్టార్ దర్శకుడు కృష్ణ వంశీ గారిని పెళ్లి చేసుకున్నారు.

#8 ప్రీత – హరి
రుక్మిణి, ప్రియమైన నీకు వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ప్రీత కూడా, దర్శకులు హరిని పెళ్లి చేసుకున్నారు. హరి తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన సింగం సిరీస్, సూర్య హీరోగా నటించిన ఆరు, విశాల్ హీరోగా నటించిన భరణి, పూజ, విక్రమ్ హీరోగా నటించిన సామి స్క్వేర్, అలాగే దీని మొదటి పార్ట్ సామితో పాటు ఇంకా ఎన్నో తమిళ్ సినిమాలకి దర్శకత్వం వహించారు.

శ్రీహరి, ప్రకాష్ రాజ్ ల మధ్య ఈ రిలేషన్ ఉంది అని అస్సలు ఉహించి ఉండరు..! ఎలా అంటే..?
సెలెబ్రిటీస్ గురించిన ఏ విషయం అయినా మనకు ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. అందులోను.. ఒక సెలెబ్రిటికి, మరొక సెలెబ్రిటీ కి మధ్య ఉండే బంధుత్వం గురించి అంటే క్యూరియాసిటీ ఉండడం సహజం. నటుడు శ్రీహరి ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నేటికీ.. ఆయన మన మధ్యనే ఉన్నారన్న భావాన్ని ఆయన సినిమాలు కలగచేస్తుంటాయి.

మరో నటుడు ప్రకాష్ రాజ్ కూడా అంతే.. తండ్రి గా, విలన్ గా ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలలో మరొకరిని ఉహించుకోలేము. అంత గా జీవిస్తారాయన. అయితే.. ప్రకాష్ రాజ్, మరియు శ్రీహరి ల మధ్య బంధుత్వం ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఈ వరస ఎలా కలుస్తుంది అంటే.. ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరు తోడల్లుళ్లు.

ప్రకాష్ రాజ్ గారి మొదటి భార్య ఓల్గా లలిత కుమారి. ఆమె ఎవరో కాదు.. శ్రీహరి భార్య “డిస్కో శాంతి” గారి చెల్లెలు. అలా వీరిద్దరూ తోడల్లుళ్లు అయ్యారు అన్నమాట. బృందావనం సినిమాలో.. తన ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజ్ ను చూసిన శ్రీహరి “నాయనా..! అన్నొచ్చిండు” అంటూ అరుస్తారు. నిజ జీవితం లో కూడా వీరు అన్నదమ్ములే. ప్రకాష్ రాజ్ గారు, లలిత కుమారి గారు కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు. కానీ, ఆ తరువాత కూడా శ్రీహరి, ప్రకాష్ రాజ్ ల మధ్య అదే సాన్నిహిత్యం కొనసాగింది.
