కొన్ని కొన్ని సార్లు ఏదో దుష్టశక్తులు మనల్ని పీడిస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజానికి ఎవరి ఇంట్లో అయినా సరే దుష్ట శక్తుల ప్రభావం ఉంటుంది. పీడ కలలు రావడం లేదంటే రాత్రి నిద్రలో హఠాత్తుగా మెలుకువ రావడం లేదు అంటే ఎప్పుడు భయం వేయడం లాంటివి కనుక జరిగితే దుష్ట శక్తి ఉందని మనం తెలుసుకోవచ్చు. అలానే ఎక్కువగా రాత్రిపూట చిన్న పిల్లలు ఏడుస్తున్నా సరే అదృశ్యశక్తులు అక్కడ ఉన్నాయని మనం గ్రహించవచ్చు.
అయితే ఈ దుష్ట శక్తులను ఎలా తొలగించాలి..?, ఈ దుష్ట శక్తుల ప్రభావం నుండి ఎలా బయట పడాలి..? అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే కచ్చితంగా దృష్టశక్తులు యొక్క ప్రభావం పూర్తిగా దూరం అయిపోతుంది.

ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేస్తే అప్పుడు ఇంట్లో ఉండే దుష్టశక్తుల్ని బయటకి పంపించేయొచ్చు.
అలానే ఎప్పుడూ కూడా ఇంట్లో దూపం వేస్తూ ఉండాలి. ధూపం వేయడం వల్ల దుష్ట శక్తులు బయటకు వెళ్లిపోతాయి.

కొన్ని తులసి ఆకులు తీసుకుని వాటిని రసం తీసి అందులో కొన్ని నీళ్లు కలిపి కలశంలోని ఆ నీళ్లు వేసి.. ఆ నీళ్ళతో పూజ చేయాలి. అలానే ఇల్లంతా కూడా ఆ నీటిని జల్లాలి. ఇలా చేయడం వల్ల దృష్టశక్తులు పోతాయి.
ఇంటి ముఖద్వారం మీద స్వస్తిక్ వంటి గుర్తులు రాస్తే కూడా దుష్టశక్తి రాదు. కాబట్టి ఇంటి ముఖద్వారం దగ్గర ఈ విధంగా పాటించండి.

దుష్టశక్తుల బారిన పడకుండా ఉండాలంటే వెండితో తయారుచేసిన ఆభరణాలను వేసుకుంటే మంచిది. దీనితో పీడకలలు కూడా రావు.
సమానంగా జీలకర్ర ఉప్పుని తీసుకుని వాటిని కలిపి ఇల్లంతా జల్లితే దుష్టశక్తి బాధల నుంచి బయటపడచ్చు.







రావణుడు విష్ణువు కోసం ముల్లోకాలు వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా విష్ణువు కనిపించడం లేదు. ఇక విష్ణువు తనేనే వెతుక్కుంటూ వచ్చేలా చేయాలనుకుంటాడు. విష్ణుమూర్తి ధర్మాన్ని పాటిస్తాడని రావణుడికి బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడికి విష్ణుమూర్తి వస్తాడు. అందుకే తాను ఎప్పటిలాగే అధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒక్క ఆలోచనే చరిత్రలో రావణుడు అంతే ఒక గొప్ప రాజు అని కాకుండా ఒక రాక్షసుడు అని ముద్ర పడేలా చేసింది. ఇక అంత్యంత హీనమైన పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అందమైన అమ్మాయిలు ఎక్కడ కనబడితే అక్కడ వారిని అనుభవించేవాడు. అలా ఒక రోజు వేదవతి అనే స్త్రీని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె రావణుడి నుండి తప్పించుకు పారిపోయి నువ్వు నా వలనే మరణిస్తావు అని శాపం పెట్టి మంటల్లో దూకి చనిపోయింది. తరువాతి జన్మలో వేదవతి సీతాదేవిగా జన్మిస్తుంది. ఆ తరువాత ఇంద్రుని సభలో ఉండే రంభ తన నాట్యంతో అందరిని ఆకట్టుకుంది. అయితే రావణాసురుడు ఆమె అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని భావిస్తాడు.
అందరు చూస్తుండగానే తనతో గడపమని రంభ పై ఒత్తిడి చేస్తాడు. అందుకు రంభ అంగీకరించకపోవడంతో ఆమె వెంటపడి బలవంత పెడతాడు. అదే సమయంలో రంభ ప్రియుడు నలకుబేరుడు రావణాసురుడికి ఒక శాపం పెడతాడు. ఇష్టం లేకుండా ఏ స్త్రీని అయినా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెడతాడు. ఈ శాపం కారణంగా చేసేదేమి లేక రావణాసురుడు రంభ విషయంలో వెనక్కి తగ్గుతాడు. సీతమ్మను ఎత్తుకెళ్లిన తరువాత ఆమెను తాకకపోవడానికి ఇదే కారణం. ఆ తరువాత రాముడు రావణుడితో యుద్దం చేసి హత్యమార్చాడు.




హిందు సనాతన ధర్మంలో మనిషి మృతికి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి. దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలకు వెళ్ళిన అనంతరం చేయాల్సిన మరియు చేయకూడని పనుల గురించి పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయోజనం మరియు క్షేమం కోసం పాటించాల్సిన పదహారు సంస్కారాలను సనాతన ధర్మంలో వివరించారు. వీటిలో ఒకటి మనిషి చనిపోయిన తరువాత చేసే కార్యక్రమానికి సంబంధించినది.
ఒక మనిషి మరణం తరువాత అంతిమ సంస్కారాలు, ఆచారాలు పూర్తి అయిన తర్వాత ఆత్మ వెళ్ళి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ ఆత్మకి ఈ లోకంతో ఉన్న సంబంధాలు అన్ని తొలగిపోతాయి. గరుడ పురాణంలో అంత్యక్రియలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి వివరించారు. గరుడ పురాణం ప్రకారంగా అంత్యక్రియల తరువాత మనిషి తిరిగి వస్తున్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు.
ఒకవేళ అలా చూసినట్లయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ చూసిన వారితో ప్రేమలో పడుతుందట. తన మరణం వల్ల ఆ వ్యక్తి ఒక్కరే బాధ పడుతున్నాడని ఆత్మ భావిస్తుందట. అలాంటి స్థితిలో ఆ ఆత్మకు శాంతి కలగదు. ఆత్మ ఆ వ్యక్తితో అనుబంధాన్నిపెంచుకుని, తనతో పాటు ఇంటికి వెళ్లాలని భావిస్తుందంట. ఈ కారణం వల్లనే అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు.










