News
తండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాలిక.! కంటతడి పెట్టించిన సంఘటన.!
సాధారణంగా పిల్లలపై ఎవరి ప్రభావం అయినా ఎక్కువగా ఉంటుంది అంటే అది తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న పని, వారి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుంది. కొంత మంది వాటిని పాటించి వారి దారిలో నడిస్తే, కొంత మంది ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు చేసేది తప్పు అయితే ఆ దారిలో మేము వెళ్ళకూడదు అనుకుని జాగ్రత్త పడతారు.
కొంత మంది పెద్ద వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే భయపడి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలకైతే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలా దిక్కుతోచని స్థితిలో ఒక బాలిక ఇటీవల చేసిన పని వింటే కన్నీళ్లు ఆగవు. వివరాల్లోకి వెళితే, జగిత్యాలకు చెందిన 12 సంవత్సరాల ఒక బాలిక పట్టణ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు సమస్య ఏంటి అని అడగగా, ఆ అమ్మాయి ఎస్ఐ నవత దగ్గర తన బాధను చెప్పింది. తన తండ్రి రోజు తాగుతున్నాడు అని, దాని వల్ల ప్రతి రోజూ గొడవలు అవుతున్నాయని, వాటివల్ల తనతో సహా తన కుటుంబ సభ్యులు మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కన్నీటి పర్యంతం అయ్యింది.
ఆ బాలిక వేదనని చూసి స్పందించిన ఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటినుండి అయినా మారాలి అని చెప్పారు. అంతే కాకుండా ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా కూడా 100 కి డయల్ చేసి సమాచారం అందిస్తే తను వచ్చి చూసుకుంటాను అని ఎస్ఐ నవత ఆ బాలిక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
Gold rates in Hyderabad: హైదరాబాద్ లో తగ్గిన బంగారం, వెండి ధరల వాటి వివరాలు ఇలా ఉన్నాయి !
హైదరాబాద్ లో తగ్గిన బంగారం, వెండి ధరల వాటి వివరాలు ఇలా ఉన్నాయి !
Gold rates in Hyderabad: భారతదేశం లో బంగారాన్ని కొనుగోలు చేసేంత దేశం మరొకటి ఉండదు. ఆడవారికి బంగారం పట్ల ఎలాంటి మక్కువ ఉంటుందో తెలియనిది కాదు. ఇక్కడ శుభకార్యాలకు బంగారం కొనుగోలుతోనే హడావుడి మొదలవుతుంది కూడా. అయితే గత కొద్ది రోజులుగా..కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బంగారం ధరలు కాస్త పెరిగాయి.

gold and silver rates in hyderabad
ఇక మళ్లీ శ్రావణమాసం తిరిగి ప్రారంభం అవ్వడం తో మళ్లీ పెళ్ళిళ్ళ సందడి తిరిగి ప్రారంభం కానుంది. ఇక హైదరాబాద్ లో పసిడి ధరలు కాస్త తగ్గాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ. 44,900, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 రూ.48,980 కు చేరింది. వీటితో పాటు వెండి కూడా ధరలు క్రమంగా తగ్గాయి. రూ.400 తగ్గి రూ.72,7౦౦ గా ఉంది.
ఇవి కూడా చదవండి :
అందుకే “పూరీ జగన్నాధ్” అంటే నాకు చాలా ఇష్టం-విజయేంద్ర ప్రసాద్
ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ లేదా స్టోరీ రైటర్ కి మరొక డైరెక్టర్ ఇష్టం ఉండడం చాలా సహజం. అలా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. ఈ మాట వినగానే మనలో చాలా మందికి ఆ వ్యక్తి రాజమౌళి ఏమో అని అనిపిస్తుంది. కానీ కాదు. విజయేంద్ర ప్రసాద్ గారికి పూరి జగన్నాధ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఇటీవల ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో కూడా చెప్పారు. అంతే కాకుండా తన మొబైల్ వాల్ పేపర్ కూడా పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది.
అయితే తనకి పూరి జగన్నాథ్ అంటే ఎందుకు అంత ఇష్టమో విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయంపై విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, “పూరి జగన్నాథ్ చాలా చిన్న పాయింట్ తీసుకుంటారు. ఆయన ఫైట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సరే, ఎదుటి వాడిని కొట్టాలి అని మనకనిపించాలి. అప్పుడే ఫైట్ బాగుంటుంది. అలా పూరి జగన్నాథ్ చిటికెలో కోపం రప్పిస్తారు. ఆ టెక్నిక్ నాకు దొరకడం లేదు. ఆయన దగ్గర ఒక సినిమా చేస్తే సీక్రెట్ ఈ టెక్నిక్ పట్టుపడుతుందేమో” అని అన్నారు.
watch video :
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మోనాల్ గజ్జర్… స్టార్ హీరో సినిమాలో అవకాశం.!
సుడిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, తర్వాత బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకుకులం అందరికీ చేరువయ్యారు మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ తర్వాత డాన్స్ ప్లస్ ప్రోగ్రాం కి కూడా జడ్జ్ గా వ్యవహరించారు. అంతే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా ఒక స్పెషల్ పాటలో నటించారు. అయితే ఇప్పుడు మోనాల్ ఇంకొక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అనే వార్త వినిపిస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాలో ఒక హీరోయిన్ గా నటించబోతున్నారట మోనాల్.

ఇందులో ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఇంకొక హీరోయిన్ క్రితి శెట్టి నటిస్తున్నారు. అలాగే నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ఈ సినిమాలో మరొక హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన కి ప్రీక్వెల్ గా రూపొందుతోంది. దీనికి కూడా మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో నటించారు. బంగార్రాజు సినిమా, తండ్రి పాత్ర అయిన బంగార్రాజు గురించి, ఆయన జీవితం ఎలా ఉండేది అనే దాని గురించి నడుస్తుందట.
గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవ్వరు ప్రొబేషన్ విషయం లో భయాలు పెట్టుకోవడద్దు
గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపిపిఎస్ సి ద్వారా నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మినహా మరే ఇతర పరీక్షలు నిర్వహించబోమని ప్రొబేషన్ విషయం లో ఎలాంటి భయాలు, అనుమానాలు అక్కర్లేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు.

ap govt gud news
సిబిఏఎస్ పరీక్షలు కానీ మరేఇతర పరీక్షలు నిర్వహించబోమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. 1 34 లక్షల మంది కేవలం డిపార్ట్మెంటల్ పరీక్షలు పాసైతే చాలునని అజయ్ జైన్ ఈ సందర్బంగా తెలిపారు.
Hyderabad water supply: హైదరాబాద్ నగర వాసులకి గమనిక కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్ ఏ ఏ ప్రాంతాల్లో అంటే !
హైదరాబాద్ మహా నగరం లో కొన్ని ప్రాంతాల్లో అనగా బుధవారం ఆగష్టు 4 న మరమత్తులు కారణంగా మంచినీటి సరఫరా అంతరాయం ఏర్పడనుంది. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ మరమత్తులు కొనసాగుతాయని హైదరాబాద్ జల మండలి ఒక ప్రకటన లో విడుదల చేసింది. భాగ్యనగరానికి అంతటికి మంచినీటి సరఫరాను చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు ఉన్న పైప్లైన్ పనులు కొనసాగనున్నాయి. ఈ సందర్బంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు అధికారులు.

hyderabad water supply
బాలాపూర్, మైసారం, బార్కాస్.,మేకలమండి, భోలక్ పూర్.తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ., హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్.. వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్., మహింద్ర హిల్స్ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ., బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు., మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.
ఇవి కూడా చదవండి :
Heavy Rains in China : వెయ్యేళ్లలోఎన్నడూలేని వర్షాలు..ఇది మాములు బీబత్సవం కాదు…అస్సలు కారణం ఇదేనా?
వెయ్యేళ్లలోఎన్నడూలేని వర్షాలు..ఇది మాములు బీబత్సవం కాదు…అస్సలు కారణం ఇదేనా?
గత ఏడాది కరోనా తో సతమతమైన చైనా ఇప్పడు భారీ వరదలతో ఉక్కిరిబిక్కరి అవుతుంది. ప్రకృతి పగబట్టిందా ? అన్నట్టుగా మునుపెన్నడూ లేని వెయ్యేళ్లలో లేని భారీ వర్షాలతో అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. భారీ వర్షాల కారణంగా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్థి నష్టం తో కొలొకోలేని స్థితిలోకి కూరుకుపోతుంది చైనా దేశం. వర్షాలని సైతం ఎప్పుడు కురవాలో శాసించే స్థాయికి ఎదిగిన చైనా మీద ప్రకృతి విరుచుకుపడుతుంది.

china floods
డ్రాగన్ కంట్రీ కి వరదల ముప్పు ఇది కొత్త కాదు, ప్రతి ఏడాది కూడా ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లుతునే ఉంది. చైనాలోని బెంగ్ జూ నగరం లో మెట్రో రైళ్లల్లో సుమారు సోగ భాగం నీటిలో మొత్తం మునిగిపోందంటే ఎంతటి విపత్తో అర్థం చేసుకోవచ్చు. ఇదే పట్టణం లోని సుమారు కోటి ఇరవైఐదు లక్షల మంది ఈ వరదల బాధితులుగా ఉన్నారు. ఇప్పటికే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాది కురవాల్సిన వర్షం మొత్తం గత మూడు రోజుల్లోనే కురిసిందంటే అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యల్లో భాగంగా సుమారు 5700 లిబరేషన్ ఆర్మీ పాల్గొన్నారు. చైనా లో వరదల ధాటికి డ్యామ్ లకు ప్రమాదం పొంచి ఉంది. చైనా లో ఇప్పటి వరకు 25 మిలియన్ డాలర్ల ఆస్థి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. చైనా వరదలకు కారణం ప్రకృతిలో వస్తున్న మార్పులు, పట్టనీకరణ లో మార్పులు, టైపూన్ వలన వచ్చే గాలులు నీటిని కూడా తీసుకోవచ్చాయని కూడా చెలుత్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సికిందరాబాద్ లో మొదలైన రంగం..భవిష్యవాణి లో స్వర్ణలత ఏమి చెప్పారంటే..?
NARAPPA: ఆ 85 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సాధించలేనిది… నారప్ప సాధించింది.
పుట్టబోయే బిడ్డతో, భర్తతో ఆనందంగా జీవితం గడపాలనుకుంది… కానీ అంతలోపే.?
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. పుట్టబోయే బిడ్డతో సంతోషంగా ఉందాం అనుకున్న యువతి ఆశలన్నీ ఆగిపోయాయి. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని తిపటూరు పట్టణానికి చెందిన చేతన్ ఒక వ్యాపారి. ఆయన భార్య మమత గర్భవతిగా ఉన్నారు. మమత ప్రసవం కోసం శనివారం ఉదయం హాస్పిటల్ కి వెళ్లారు.
అక్కడ మమతని అడ్మిట్ చేసుకున్న ఆస్పత్రి సిబ్బంది మమతకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ బంధువులకి చెప్పారు. మమతని అబ్జర్వేషన్లో ఉంచారు. చివరికి సాధారణ కాన్పు అయ్యే అవకాశం లేదు అని, సిజేరియన్ చేయాలి అని చెప్పి చేతన్ వద్ద సంతకాలు తీసుకున్నారు తర్వాత ఆపరేషన్ థియేటర్ లోకి మమతని తీసుకువెళ్లి చికిత్స ప్రారంభించారు.

మమతకి అప్పటికీ సీరియస్ అవ్వడంతో ఆపరేషన్ సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చి మరణించారు. ఈ విషయం తెలిసిన చేతన్, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మమత చనిపోయారు అని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిజేరియన్ వికటించి రక్తపు వాంతులు చేసుకున్నారు అని తెలిసింది అని అన్నారు. వైద్యులు ముందుగానే ఆపరేషన్ చేసి ఉంటే మమత బతికి ఉండే వారు అని అన్నారు. ఈ విషయంపై తిపటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
అడ్రస్ అడిగే పేరుతో “అసభ్య ప్రవర్తన”… దాంతో ఆ యువతి ఏం చేసిందంటే..?
అడ్రస్ కావాలి అని అడుగుతూ ఒక అమ్మాయితో ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గౌహతి కి చెందిన భావన కశ్యప్ ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే వీధిలో ఒక యాక్టివా స్కూటర్ మీద ఒక యువకుడు వచ్చి భావన ని సినాకీ పాత్ కి దారి కావాలి అని అడిగాడు.
భావన,తనకి అడ్రస్ తెలియదు అని చెప్పారు. అప్పుడు ఆ యువకుడు, తనకి ఏమి వినిపించట్లేదు అని దగ్గరికి వచ్చి చెప్పమని అడిగాడు. భావన అతని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ యువకుడు ఆమె ఛాతిని ముట్టుకున్నాడు. అతను చేసిన పనికి షాక్ అయిన భావన తన కోపాన్ని చూపించారు.
స్కూటర్ తో సహా ఆ యువకుడిని పక్కనే ఉన్న డ్రైనేజ్ లోకి తోసేశారు. ఈ లోపు గట్టిగా కేకలు పెట్టి చుట్టు పక్కన ఉన్న వాళ్లందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్పారు. జరిగిన విషయమంతా చెప్తూ వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో భావన మాట్లాడుతూ, “అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించి, పారిపోవడానికి ప్రయత్నించాడు.
“వెంటనే నేను స్కూటర్ వెనకాల టైర్ పైకి లేపాను. దాంతో అది ముందుకు వెళ్లలేదు. తర్వాత డ్రైనేజ్ లోకి తోసేశాను అని చెప్పారు. అతని పేరు మధుసనా రాజ్ కుమార్ అని కూడా చెప్పారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని అతన్ని అరెస్ట్ చేశారు.
watch video :
