నార్త్ కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా నదులు,చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.తాజాగా కడప నుండి కర్ణాటక వెళ్తున్న ఒక కార్ ఈ ఉధృతి లో ఇరుక్కుని కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కడప నుండి కారులో బెంగళూరు బయలుదేరిన రాకేష్ ,యూసఫ్ అనే 30 ఏళ్ళ యువకులు లోకల్ బస్ వెనకాల గూటి, గుంతకల్లు మధ్య ఉదయం 8:45 నిమిషాల సమయంలో వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి నీటి ప్రవాహంలో వాళ్ళ కారు ఇరుక్కుంది.ముందుకు వెళ్లాలని కారు లోని రాకేష్, యూసఫ్ ఎంత ప్రయత్నించిన కారు ముందుకు వెళ్ళలేదు.ఆ నీటి ఉధృతి దాటికి నిలువలేక కారు నీటిలో కొట్టుకుపోయింది అదృష్టవశాత్తు రాకేష్ ,యూసఫ్ ప్రాణాలతో బయటపడ్డారు.వైరల్ అవుతున్న ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.