బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ మంచి పాజిటివ్ వాల్స్ నెలకొల్పిన ఈ మూవీ ఈ వీకెండ్ కలెక్షన్స్ లో ముందంజలో ఉంటుందని అంచనా. తెలుగు స్ట్రైట్ ఫిలిం లాగా ఇది తొలి రోజు బుకింగ్ తో అగరగొట్టింది. ఇక ఈ మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా, యానిమల్ సినిమా ఓటీటీ పార్ట్నర్ కు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో దీని మీద సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది. మొదటిరోజు సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తండ్రి కొడుకులు మధ్య సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ ప్రేక్షకులు తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. పోటీగా పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో ఈ మూవీ బాగా హీట్ అయ్యే ఆస్కారం కల్పిస్తుంది.
ఇక ఈ విషయం పక్కన పెడితే మూవీకి సంబంధించిన రన్ టైం కూడా చాలా పెద్దదని చెప్పవచ్చు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా అద్భుతమైన నటన కనబరిచింది. రన్బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ బాగా ఆకట్టుకున్నారు. హీరోకి దీటుగా విలన్ పాత్ర లో బాబీ డియోల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ కనబరిచాడు. ఈ మూవీకి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నేట్లిక్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం అయితే సంక్రాంతికి లేకపోతే రిపబ్లిక్ డే కి స్ట్రీమింగ్ అయ్యే ఆస్కారం ఉంది.